రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం

ప్రధానాంశాలు

రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం

ఈనాడు, హైదరాబాద్‌: బంగాళాఖాతం ఉత్తర ప్రాంతంలో 1500 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో బుధవారం(28న) అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ భారత ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. రుతుపవనాల కదలికలు సాధారణంగా ఉన్నాయి. మంగళ, బుధవారాల్లో తెలంగాణలో అక్కడక్కడ ఒక మాదిరి వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. సోమవారం మధ్యాహ్నం పలు ప్రాంతాల్లో స్వల్పంగా వర్షాలు కురిశాయి. అత్యధికంగా సోమూరు(కామారెడ్డి జిల్లా)లో 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎక్కువ ప్రాంతాల్లో పొడి వాతావరణ మేర్పడటంతో గాలిలో తేమ సాధారణంకన్నా 10 శాతం వరకు తక్కువగా ఉంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని