నాడు మెట్ట.. నేడు పచ్చని పంట!

ప్రధానాంశాలు

నాడు మెట్ట.. నేడు పచ్చని పంట!

క్కడో అట్టడుగున కనిపించే నీళ్లు.. పేరుకే ఆయకట్టు.. చుట్టూ బీడువారిన పొలాలు. తలాపునే మానేరు ఉన్నా.. సాగునీటికి రైతన్నకు తప్పని గోస.. మెట్టప్రాంతమైన రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొన్నటి వరకు ఉన్న దైన్య స్థితి. కానీ నేడు ఆ ప్రాంతం పచ్చని పంట పొలాలతో కళకళలాడుతోంది. జిల్లాలో గంభీరావుపేట మండలం నర్మాలలోని ఎగువ మానేరు జలాశయాన్ని వేసవిలో కాళేశ్వరం జలాలతో నింపారు. దానికి వరదనీరు తోడైంది. సింగసముద్రం చెరువులోకి వరద పోటెత్తడంతో మత్తడి దూకుతోంది. వానాకాలం రైతన్న ఆశలకు జీవం పోస్తూ పరవళ్లు తొక్కుతున్న నీటితో మెట్ట ప్రాంత రైతును సాగు సంబరంలో ముంచింది.

- ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని