భారత్‌ ఓటమికి ఒకరిద్దరు బాధ్యులు కాదు: అసదుద్దీన్‌

ప్రధానాంశాలు

భారత్‌ ఓటమికి ఒకరిద్దరు బాధ్యులు కాదు: అసదుద్దీన్‌

అబిడ్స్‌, న్యూస్‌టుడే: ఆటలో గెలుపోటములు సర్వసాధారణమని ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయం దారుస్సాలాంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివారం జరిగిన ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌లో భారత్‌ జట్టు ఓడిపోగా.. ఒకరిద్దరు క్రీడాకారులను బాధ్యుల్ని చేస్తూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడం సరికాదన్నారు. ఒకవైపు పాకిస్థాన్‌ నుంచి వస్తున్న ఉగ్రవాదులతో జమ్మూ-కశ్మీర్‌లో భారత సైన్యం పోరాడుతుంటే.. ఆ దేశంతో క్రికెట్‌ ఆడటమేంటని తాను ముందుగానే చెప్పానని అసదుద్దీన్‌ గుర్తుచేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా జమ్మూ-కశ్మీర్‌లో బుల్లెట్‌ ఫ్రూఫ్‌ కాని వాహనంలో పర్యటిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ప్రస్తావిస్తూ.. తాను దేశ నలుమూలలా పర్యటిస్తున్నానని, ఎక్కడా బుల్లెట్‌ ఫ్రూఫ్‌ వాహనాల్ని వాడటం లేదని పేర్కొన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని