పీఎంఆర్‌ఎఫ్‌ పథకానికి 13 మంది హెచ్‌సీయూ విద్యార్థులు

ప్రధానాంశాలు

పీఎంఆర్‌ఎఫ్‌ పథకానికి 13 మంది హెచ్‌సీయూ విద్యార్థులు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రతిష్ఠాత్మక ప్రధానమంత్రి పరిశోధక ఫెలోస్‌(పీఎంఆర్‌ఎఫ్‌) పథకానికి హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి చెందిన 13 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. రసాయనశాస్త్ర విభాగం నుంచి సంగోజి ధీరజ్‌, లైఫ్‌ సైన్సెస్‌ విభాగం నుంచి సుమిరాణా, కేఎం తనిష్క, అమృతఅర్పితపాద్య, జక్కుల ప్రణయ్‌, భౌతికశాస్త్ర విభాగం నుంచి నితిన్‌చౌదరి, ప్రియామిశ్రా, పాపియా పాండా, ఎస్‌.అర్చన, ప్రసేన్‌జిత్‌ జానా, సోమ్‌నాథ్‌దాస్‌, ఇంజినీరింగ్‌ సైన్సెస్‌ నుంచి కె.ఫాతిమాఅలీ, గణితం-అంకగణితశాస్త్రం నుంచి అకురాతి జయనాగశ్రీ ఎంపికయ్యారు. 2021 సంవత్సరానికి హెచ్‌సీయూకు 18 ఫెలోషిప్‌లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. తొలి విడతగా 13 మంది విద్యార్థులను జాతీయ సమన్వయ కమిటీ ఎంపిక చేసింది. దీనికి ఎంపికైన విద్యార్థులకు తొలుత నెలకు రూ.70వేల వంతున అందజేస్తారు. దీనికి అదనంగా పరిశోధన కోసం ఏటా రూ.2లక్షలు మంజూరవుతుంది.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని