చేయీచేయీ కలిపి...సేతువుకు ఊపిరులూది!

ప్రధానాంశాలు

చేయీచేయీ కలిపి...సేతువుకు ఊపిరులూది!

అది వికారాబాద్‌ జిల్లా పరిగి మండలం చిగురాల్‌పల్లి గ్రామం.. సమీపంలో లోతైన వాగు.. వానాకాలం వస్తే చాలు.. దాని ఉద్ధృతికి అంతా బెంబేలు.. వాగుకు అవతల ఉన్న పొలాలకు వెళ్లాలంటే అందులో ప్రాణాలకు తెగించి దిగక తప్పని పరిస్థితి.. వాగును సురక్షితంగా దాటాలంటే అక్కడో వంతెన అత్యవసరం.. అందుకోసం పదేపదే నేతలు, అధికారులను కలిశారు. గోడు చెప్పుకొన్నారు.. ఫలితం శూన్యం.. వారి వేదన అరణ్య రోదన..

ఎవరో వస్తారని, ఏదో ఉద్ధరిస్తారని ఎదురుచూసి విసిగిపోయిన ఆ రైతులంతా దృఢంగా ఓ సంకల్పం తీసుకున్నారు. సమస్యకు సమష్టిగా పరిష్కారం చూపాలనుకున్నారు. చేయిచేయి కలిపారు.. చేవతో కదిలారు. ఇవ్వగలిగినవారంతా చందాలిచ్చారు. సాధ్యం కానివారు స్వచ్ఛందంగా కదిలారు. శ్రమదానం చేశారు. రూ.అరలక్షతో వారం రోజుల్లోనే కర్రలతో రెండు వంతెనలు అందుబాటులోకి తెచ్చారు.. వాటిపై ఇపుడు ధీమాగా కదులుతున్నారు. అయితే గతంలో ఇలాగే ఇక్కడ కట్టుకున్న వంతెనలు వాగు ఉద్ధృతికి కాలక్రమంలో కొట్టుకుపోయాయి.. ఇటీవలే ఓ యువరైతు వాగు ఒరవడికి ప్రాణాలు కోల్పోయాడు. ఈ క్రమంలో సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాల్సి ఉంది.

- ఈనాడు, హైదరాబాద్‌

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని