పిల్లలు ఎత్తు పెరగాలంటే ఇలా చేయండి! - easy exercises to increase your kids height in telugu
close
Published : 21/09/2021 17:06 IST

పిల్లలు ఎత్తు పెరగాలంటే ఇలా చేయండి!

తమ పిల్లలు ఎత్తుగా ఉండాలి.. ఎత్తుకు తగ్గ బరువుండాలి.. అని తల్లిదండ్రులు కోరుకోవడం సహజం. అయితే కొంతమంది చిన్నారుల్లో పెరుగుదల మందకొడిగా సాగడం, ఒక వయసొచ్చాక ఆగిపోవడం వల్ల సరైన ఎత్తు పెరగక పొట్టిగా కనిపిస్తుంటారు. తల్లిదండ్రుల జీన్స్‌ ఒక్కటే దీనికి కారణం అనుకుంటే పొరపాటే! ఎందుకంటే పోషకాహార లోపం, శరీరానికి సరైన వ్యాయామం లేకపోవడం, వారుండే వాతావరణం.. వంటివీ చిన్నారుల ఎత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతాయంటున్నారు నిపుణులు. ఈ క్రమంలోనే పిల్లలు ఎత్తు పెరగడానికి కొన్ని వ్యాయామాలు దోహదం చేస్తాయంటున్నారు. మరి, ఏంటా వర్కవుట్లు? మనమూ తెలుసుకుందాం రండి..

సాగదీత వ్యాయామాలు..

సాగదీత వ్యాయామాలు (Stretching Exercises) చేయడానికి సులభంగా, పిల్లలు ఎత్తు పెరగడానికి ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తాయంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో నిటారుగా నిల్చొని కిందికి వంగుతూ కాలి వేళ్లను అందుకోవడం, కాళ్లు ముందుకు చాపి కూర్చొని చేతి వేళ్లతో కాళ్లను అందుకోవడం, శరీర పైభాగాన్ని ఇరువైపులా వంచుతూ చేసే వ్యాయామాలు.. ఇలాంటి వర్కవుట్లు వెన్నెముకకు ఫ్లెక్సిబులిటీని అందిస్తాయి. అది సులభంగా సాగేలా చేస్తాయి. ఫలితంగా వయసు పెరిగే కొద్దీ ఎత్తు పెరగడం సులువవుతుంది.

వేలాడితే మంచిదే!

పిల్లలు ఎత్తు పెరగడానికి చాలామంది నిపుణులు సూచించే వ్యాయామాలివి. బార్‌ హ్యాంగింగ్స్‌, హ్యాంగింగ్‌ రాడ్‌, పులప్స్‌, చిన్‌-అప్స్‌.. వంటి ఎక్సర్‌సైజెస్‌ వెన్నెముకను సులభంగా సాగేలా చేస్తాయి. తద్వారా వయసు పెరిగే కొద్దీ ఎత్తు పెరగచ్చు. అలాగే ఈ వ్యాయామాలు వెన్ను, భుజాల కండరాలకు దృఢత్వాన్ని అందించి ఫిట్‌గా మార్చుతాయి.

ఈ యోగాసనాలతో..!

కొన్ని రకాల యోగాసనాలు శారీరక దృఢత్వాన్ని పెంచడమే కాదు.. పిల్లలు ఎత్తు పెరగడానికీ దోహదం చేస్తాయంటున్నారు నిపుణులు. సూర్య నమస్కారాలు చేయడం వల్ల శరీరమంతటికీ చక్కటి వ్యాయామం అందుతుంది. అలాగే భుజాలు, వీపు, కాళ్లలోని కండరాలను బలంగా మార్చి సులభంగా సాగేలా చేస్తుంది. ఇక చక్రాసనం వల్ల భుజాలు, పాదాలపై ఒత్తిడి పడుతుంది. తద్వారా అక్కడి కండరాలు దృఢమవడంతో పాటు సాగుతాయి. ఫలితంగా ఎత్తు పెరిగే ప్రక్రియ వేగవంతం అవుతుంది.

స్కిప్పింగ్‌-స్విమ్మింగ్‌

స్కిప్పింగ్‌ ఆడడమంటే ఆడపిల్లలకు భలే సరదా. ఎంతో సరదాగా చేసే ఈ వ్యాయామం వారి శరీరానికి దృఢత్వాన్ని అందించడమే కాదు.. గుండె ఆరోగ్యాన్ని సైతం మెరుగుపరుస్తుంది. అలాగే ఈ వర్కవుట్‌లో భాగంగా ఎగిరి దూకే క్రమంలో వెన్నెముక, భుజాలు, కాళ్లలోని కండరాలు ఫ్లెక్సిబుల్‌గా మారతాయి.. సులభంగా సాగేలా తయారవుతాయి. ఫలితంగా వయసు పెరిగే కొద్దీ ఎత్తు పెరగడం ఈజీ అవుతుంది.

ఇక ఈత కొట్టే క్రమంలో కూడా శరీరాన్ని ముందుకు సాగదీస్తాం. తద్వారా వెన్నెముకకు చక్కటి వ్యాయామం అందుతుంది. ఇది కూడా ఎత్తు పెరిగేందుకు సహాయపడుతుంది.

ఇవి కూడా!

* మన శరీరంలో HGH (Human Growth Hormone) అనే పెరుగుదలను ప్రేరేపించే హార్మోన్‌ ఉంటుంది. ఇది పిల్లల్లో నిద్రపోయినప్పుడు మాత్రమే విడుదలవుతుందట! అందుకే చిన్నారుల ఎంత నిద్రపోతే అంతగా పెరుగుతారంటారు.

* విటమిన్‌ ‘డి’ సైతం చిన్నారులు ఎత్తు పెరిగేందుకు ప్రేరేపిస్తుందంటున్నారు నిపుణులు. ఇది కండరాలు, ఎముకల సామర్థ్యం పెరిగేలా చేసి.. పరోక్షంగా ఎత్తు పెరగడానికి సహకరిస్తుంది. ఇందుకోసం రోజూ కాసేపు సూర్యరశ్మిలో నిలబడడం.. చేపలు, పుట్టగొడుగులు, గుడ్లు.. వంటి విటమిన్‌ ‘డి’ అధికంగా ఉండే ఆహార పదార్థాలు వారి డైట్‌లో భాగం చేయడం మంచిది.

* పిల్లలకు అందించే ఆహారంలో ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు.. ఇలా అన్ని పోషకాలు ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం సీజనల్‌ పండ్లు, అన్ని రకాల కాయగూరలు-దుంపలు, ఆకుకూరలు.. వంటివన్నీ వారి ఆహారంలో చేర్చాలి. ఇవే వారిని బలంగా, ఆరోగ్యంగా ఎదిగేలా చేస్తాయి.

అయితే పిల్లలు ఎత్తు పెరిగేందుకు దోహదం చేసే ఈ వ్యాయామాలన్నీ వారికి చిన్నతనం నుంచే అలవాటు చేయడం మరీ మంచిది. ఒకవేళ ఇప్పుడిప్పుడే కొత్తగా నేర్చుకుంటోన్న వారైతే.. నిపుణుల పర్యవేక్షణలో సాధన చేయించడం వల్ల వాటిని సరైన రీతిలో చేయగలుగుతారు. సత్వర ఫలితాలు పొందగలుగుతారు. అలాగే వారితో చేయించే వ్యాయామాలు, వారికి అందించే పోషకాహారం విషయంలో ఏవైనా సందేహాలుంటే నిపుణుల్ని అడిగి నివృత్తి చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.



మరిన్ని

ఇంట్లో పదే పదే తాకే వాటిని ఇలా శుభ్రం చేయాల్సిందే!

ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో రోజూ మనం ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్లొచ్చినా వ్యక్తిగత శుభ్రత పాటించడం, మనతో పాటు తెచ్చిన వస్తువుల్ని శానిటైజ్‌ చేయడం.. వంటివి కచ్చితంగా పాటిస్తున్నాం.. మరి, మనం ఇంట్లో పదే పదే తాకే వస్తువుల సంగతేంటి? మనం బయటికెళ్లినా అవి ఇంట్లోనే ఉంటున్నాయి కదా.. అంటారా? అయినా సరే.. వాటిని రోజూ శుభ్రం చేయాల్సిందే అంటున్నారు నిపుణులు. తద్వారా వాటిపై చేరే వైరస్‌, బ్యాక్టీరియా, క్రిములు ఒకరి నుంచి మరొకరికి అంటుకోకుండా జాగ్రత్తపడచ్చు. ఇంతకీ మనం ఇంట్లో తరచూ తాకే ప్రదేశాలు, వస్తువులేంటి? వాటిని ఎలా శానిటైజ్‌ చేయాలి? రండి తెలుసుకుందాం..!

తరువాయి

అందుకే టవల్స్ విషయంలోనూ శుభ్రంగా ఉండాల్సిందే!

ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి నిద్రపోయే వరకు రోజులో ఎన్నోసార్లు ముఖాన్ని, చేతుల్ని కడుక్కుంటూ ఉంటాం. ఇలా కడిగిన ప్రతిసారీ కచ్చితంగా టవల్‌తో తుడుచుకోవాల్సిందే. ఇలా మనకు తెలియకుండానే రోజులో చాలాసార్లు టవల్‌ను వాడుతూనే ఉంటాం. మరి, మీరు నిత్యం ఉపయోగించే ఈ టవళ్లు బ్యాక్టీరియాలకు మంచి ఆవాసాలనే విషయం మీకు తెలుసా? కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో - ప్రతి రోజూ మీరు ఉపయోగించే టవల్ విషయంలో ఎంతవరకు జాగ్రత్త వహిస్తున్నారు? ఇంతకీ టవళ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకపోతే కలిగే నష్టాలేంటి..? వీటిని అధిగమించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?.. రండి తెలుసుకుందాం..

తరువాయి

మాడ్యులర్ కిచెన్ ఎలా ఉండాలంటే..

కొత్త ట్రెండ్స్ కేవలం ఫ్యాషన్‌కు మాత్రమే పరిమితం అనుకుంటే పొరపాటే. మనం కొత్తగా సిద్ధమవ్వడమే కాదు.. మన ఇంటినీ కొంగొత్త ఇంటీరియర్స్‌తో సరికొత్తగా మార్చేయవచ్చు. అందులోనూ.. ప్రస్తుతం మహిళలందరూ మారుతున్న ట్రెండ్స్‌కు అనుగుణంగా తమ ఇంటిని ట్రెండీగా, స్త్టెలిష్‌గా తీర్చిదిద్దుకోవాలని భావిస్తున్నారు కూడా.. ఈ నేపథ్యంలో చాలామంది మాడ్యులర్ కిచెన్స్‌కు ఓటేస్తున్నారు. అయితే వీటి నిర్మాణ క్రమంలో కొన్ని ముఖ్యమైన అంశాలు దృష్టిలో పెట్టుకుంటేనే వంటగది సౌకర్యవంతంగా నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుందంటున్నారు ఇంటీరియర్ నిపుణులు. మరి, ఆ అంశాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

కరోనా వేళ నగల్ని కూడా ఇలా శానిటైజ్ చేయాల్సిందేనట!

కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నంత మాత్రాన వైరస్‌ పీడ విరగడైంది అనుకోవడానికి లేదు.. ఎందుకంటే ఈ మాయదారి మహమ్మారి ఎప్పుడెలా విరుచుకుపడుతుందో ఎవరికీ అంతు చిక్కట్లేదు. అందుకే కొవిడ్‌ తగ్గుముఖం పట్టినా, టీకా వేసుకున్నా కనీస జాగ్రత్తలు పాటించాల్సిందే అని నిపుణులు పదే పదే చెబుతున్నారు. ఇక బయటి నుంచి తెచ్చిన ప్రతి వస్తువునూ శానిటైజ్‌ చేయాల్సిందే అంటున్నారు. మనం రోజూ ధరించే వివిధ రకాల ఆభరణాలూ ఇందుకు మినహాయింపు కాదంటున్నారు. ఎందుకంటే కరోనా వైరస్‌ లోహాలపై మూడు గంటల నుంచి మూడు రోజుల దాకా జీవించి ఉంటుందని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) సంస్థ చెబుతోంది. ఈ నేపథ్యంలో మనం రోజూ ధరించే ఆభరణాలను ఎలా శానిటైజ్‌ చేయాలో తెలుసుకుందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని