నా నాలుగేళ్ల శ్రమను నీరుగార్చద్దు.. నన్ను టోక్యోకు పంపండి! - female afghan athlete appeals for help to get to tokyo
close
Published : 20/08/2021 17:53 IST

నా నాలుగేళ్ల శ్రమను నీరుగార్చద్దు.. నన్ను టోక్యోకు పంపండి!

(Photo: Instagram)

అంగవైకల్యంతో పుట్టిన జకియాకు అది పెద్ద లోపంగా అనిపించలేదు. ఇరుగుపొరుగు వారు జాలి చూపిస్తున్నా ఆత్మవిశ్వాసమే ఆయుధంగా ముందుకు సాగింది. కట్టుబాట్లను కాదని తైక్వాండో ఆటపై ప్రేమ పెంచుకుంది. అంతర్జాతీయ పోటీల్లో పతకాలు కూడా సాధించింది. ఇక గెలవాల్సింది పారాలింపిక్స్‌ మెడల్‌ ఒక్కటేనంటూ నాలుగేళ్ల పాటు అహోరాత్రాలు శ్రమించింది. టోక్యో విమానం ఎక్కేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంది.

నన్ను టోక్యో తీసుకెళ్లండి!

అయితే అనూహ్యంగా దేశంపై దండెత్తిన తాలిబన్లు ఆమె ఆశయానికి కూడా అడ్డుపడ్డారు. అఫ్గాన్‌ తరఫున మొదటి పారా ఒలింపియన్‌గా నిలవాలన్న తన కల కలగానే మిగిలిపోయేలా ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో తనకిష్టమైన ఆట కోసం ఎన్నో అడ్డంకులను ధైర్యంగా దాటి వచ్చిన జకియా... ఇప్పుడు టోక్యో వెళ్లేందుకు సహాయం చేయాలని దీనంగా వేడుకుంటోంది.

పారాలింపిక్స్ ఆశలకు కళ్లెం!

కరోనా కారణంగా గతేడాది జరగాల్సిన పారాలింపిక్స్ ఈనెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. టోక్యో వేదికగా జరిగే ఈ విశ్వక్రీడల్లో 4 వేల మందికి పైగా క్రీడాకారులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అఫ్గానిస్థాన్‌కు చెందిన 23 ఏళ్ల జకియా ఖుదాదదీ కూడా వైల్డ్‌ కార్డ్‌ ద్వారా పారాలింపిక్స్‌ బెర్తును ఖాయం చేసుకుంది. K-44 మహిళల 49 కేజీల విభాగంలో తైక్వాండో పోటీల్లో పోటీపడేందుకు శారీరకంగా, మానసికంగా సిద్ధమైంది. ఇక టోక్యో విమానం ఎక్కడమే తరువాయి అన్న తరుణంలో తాలిబన్లు కాబూల్‌తో పాటు అఫ్గాన్‌ మొత్తాన్ని ఆక్రమించేసుకున్నారు. ప్రధాన విమానాశ్రయాలన్నింటినీ మూసేశారు. దీంతో పారాలింపిక్స్‌లో పాల్గొన్న తొలి అఫ్గాన్‌ మహిళగా చరిత్ర సృష్టించాలనుకున్న జకియా కలలకు కళ్లెం పడింది.

ఇంటి పెరట్లోనే శిక్షణ!

అఫ్గానిస్థాన్‌లోని హెరాత్‌ ప్రావిన్స్‌కు చెందిన జకియా పుట్టుకతోనే దివ్యాంగురాలు. అయితేనేం అణువణువునా ఆత్మవిశ్వాసం నింపుకొంది. కట్టుబాట్లను కాదని అబ్బాయిలతో సరిసమానంగా ఆటల్లోనూ రాణించింది. అఫ్గాన్ తరఫున రెండు ఒలింపిక్స్ పతకాలు సాధించిన తైక్వాండో క్రీడాకారుడు రోహుల్లా నిక్పాయ్‌ను స్ఫూర్తిగా తీసుకుని తైక్వాండోలో తన ప్రస్థానాన్ని ప్రారంభించింది జకియా. అమ్మాయిలు ఆటల్లో శిక్షణ తీసుకోవడమనేది తాలిబన్ల సంప్రదాయానికి వ్యతిరేకం కావడంతో తన ఇంటి పెరట్లోనే ఎక్కువగా తర్ఫీదు పొందింది. ఈ క్రమంలోనే 2016లో ఈజిప్టు వేదికగా జరిగిన పారా తైక్వాండో ఛాంపియన్‌షిప్‌ను గెల్చుకుంది. అప్పుడే ఆమె గురించి క్రీడాలోకానికి మొదటిసారిగా తెలిసింది.

వైల్డ్‌కార్డ్‌తో టోక్యో బెర్తు!

పారాలింపిక్స్‌ పతకం కోసం నాలుగేళ్లుగా తీవ్రంగా శ్రమిస్తోంది జకియా. శిక్షణలో ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తి ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా తన స్వశక్తితో ముందుకు సాగింది. దీనికి తోడు కరోనా పరిస్థితుల కారణంగా పారాలింపిక్స్‌ అర్హత పోటీలకు కూడా వెళ్లలేకపోయింది. కానీ అదృష్టవశాత్తూ వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీతో టోక్యో బెర్తు ఖాయం చేసుకుంది.

‘రెండు నెలల క్రితమే నాకు పారాలింపిక్స్ బెర్తు ఖరారైంది. అర్హత పోటీలకు వెళ్లకపోయినా విశ్వక్రీడల్లో పాల్గొనే అవకాశం వచ్చినందుకు ఎంతో సంతోషించాను. అఫ్గాన్‌ తరఫున ఈ పోటీల్లో ప్రాతినిథ్యం వహిస్తున్న తొలి మహిళనైనందుకు గర్వపడ్డాను. ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుందామని మరింత కఠోర సాధన చేశాను’ అని ఇటీవల ఓ సందర్భంలో చెప్పుకొచ్చిందీ యంగ్‌ అథ్లెట్‌.

ప్రపంచ దేశాలు చొరవ చూపాలి!

అయితే రెండురోజుల క్రితం ఇంటర్నేషనల్‌ పారాలింపిక్‌ కమిటీ (IPC) విడుదల చేసిన ఒక ప్రకటన జకియా పారాలింపిక్స్‌ కలను పూర్తిగా నీరుగార్చింది. ‘అఫ్గాన్‌లో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధాన నగరాలు, పట్టణాల విమానాశ్రయాలు మూసివేయబడ్డాయి. టోక్యోకు అన్ని దారులు మూసుకుపోయాయి. అఫ్గానిస్థాన్‌ నేషనల్‌ పారాలింపిక్స్ కమిటీ కూడా తమ క్రీడాకారులను టోక్యోకు పంపట్లేదని పేర్కొంది. ఇది చాలా కఠినమైన నిర్ణయమే. కానీ ఈ పరిస్థితుల్లో క్రీడాకారుల ప్రాణాల కంటే ఏదీ ఎక్కువ కాదు’ అనేది ఆ ప్రకటన సారాంశం.

ఈ ప్రకటన వెలువడిన కొద్ది సేపటికే జకియా ఓ వీడియో సందేశం పంపింది. ‘టోక్యోకు బయలుదేరేందుకు ఎన్నో కష్టాలు పడి కాబూల్‌కు చేరుకున్నాను. కానీ ఇక్కడ ఎటుచూసినా తాలిబన్లే కనిపిస్తున్నారు. వారు నాతో పాటు నా కుటుంబ సభ్యులకు ను ఏక్షణంలోనైనా హాని తలపెట్టవచ్చు. అయినా నాకు పారాలింపిక్స్‌లో పాల్గొనాలని ఆశగా ఉంది. దయచేసి టోక్యో వెళ్లేలా నాకు తోడ్పాటు అందించండి. నా ఇన్నేళ్ల శ్రమ నీరుగారడం నాకిష్టం లేదు. మా అఫ్గానిస్థాన్‌ మహిళలు, బాలికలను తాలిబన్ల ఆంక్షల నుంచి తప్పించేలా ప్రపంచ దేశాలు చొరవ తీసుకోవాలి’ అని అడుగుతోందీ యువ క్రీడాకారిణి.


Advertisement


మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి

సైజ్‌ జీరో కాదు.. ఆరోగ్యం ముఖ్యం!

‘మనసులో కలిగే ఆలోచనల్నే శరీరం ప్రతిబింబిస్తుంది..’ అంటోంది ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అంకితా కొన్వర్‌. సైజ్‌ జీరో గురించి ఆలోచిస్తూ బాధపడితే మరింత బరువు పెరుగుతామని, అదే ఆరోగ్యంపై దృష్టి పెడితే శరీరం, మనసు రెండూ మన అధీనంలో ఉంటాయని చెబుతోంది. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెడుతూ.. ఆ చిట్కాల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అందరిలో స్ఫూర్తి నింపే ఈ మిసెస్‌ సోమన్‌.. తాజాగా బాడీ పాజిటివిటీ గురించి ఇన్‌స్టాలో మరో స్ఫూర్తిదాయక పోస్ట్‌ పెట్టింది. సైజ్‌ జీరో కంటే ఆరోగ్యమే ముఖ్యమంటూ ఆమె షేర్‌ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

తరువాయి

ఆఫీసులో కోపం కట్టలు తెంచుకుంటోందా? ఇలా చేసి చూడండి..!

ఉద్యోగినులకు ఇటు ఇంటి పనులు, అటు ఆఫీస్‌ ఒత్తిళ్లు సర్వసాధారణమే అయినా.. కొంతమంది వీటిని అదుపు చేసుకోలేక ఒక్కోసారి పని ప్రదేశంలోనే ఎదుటివారిపై విరుచుకుపడుతుంటారు. దీన్నే ‘వర్క్‌ప్లేస్‌ బర్నవుట్’గా పేర్కొంటున్నారు నిపుణులు. నిజానికి ఇలాంటి దీర్ఘకాలిక ఒత్తిడి ఆరోగ్యానికే కాదు.. కెరీర్ పైనా ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయంటున్నారు. అందుకే దీన్ని ఆదిలోనే గుర్తించి మేనేజ్‌ చేసుకోగలిగితే దీనివల్ల కెరీర్‌పై మచ్చ పడకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని