500మంది కళ్లకు వెలుగుగా..
close
Published : 23/11/2020 01:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

500మంది కళ్లకు వెలుగుగా..

తాను అనుభవించిన బాధను మరెవరూ పడకూడదు అనుకుంది. చిన్న వయసులోనే పెద్ద మనసుతో ఆలోచించి వృద్ధులకు చేయూతను అందిస్తోంది. వారి కళ్లతో పాటు జీవితాల్లోనూ వెలుగులు నింపుతోంది.

ష్టాలను స్వయంగా అనుభవించిన వారికే ఎదుటివారి కష్టం అర్థమవుతుంది. అందుకే పెద్ద మనసుతో సాయం చేయడానికి ముందుకు వచ్చింది లక్ష్మీ గోపీనాథం. ఈమె సొంతూరు కేరళలోని పాలక్కడ్‌. తండ్రి గోపీనాథం ఉద్యోగరీత్యా ఈమె చిన్నతనంలోనే నైజీరియాకు వెళ్లిపోయారు. ఆయన బ్రిటిష్‌ ఆయిల్‌ కంపెనీలో ఫైనాన్స్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.
లక్ష్మి నాలుగో తరగతి చదువుతున్నప్పుడ బ్లాక్‌బోర్డు మీది అక్షరాలు సరిగా కనిపించేవి కావు. వెంటనే ఆసుపత్రిలో చూపిస్తే.. చికిత్స చేసిన తర్వాత ఆమె చూపు మెరుగైంది. నాలుగు రోజులపాటు అసలు ఏమీ కనిపించలేదామెకు. ఆ సమయంలో కంటి చూపు విలువేంటో తెలిసింది.
లక్ష్మి చిన్నాన్న వినోద్‌ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని కంటి ఆసుపత్రిలో కార్యదర్శిగా పనిచేస్తున్నారు. రెండేళ్ల కిందట ఆమె తల్లిదండ్రులతో కలిసి చిన్నాన్న దగ్గరకు వచ్చింది. వరుసగా మూడు రోజులపాటు లయన్స్‌ క్లబ్‌ కంటి ఆసుపత్రికి వెళ్లింది. అక్కడ ఎంతోమంది పేదలు కంటిచూపు సరిగా లేక బాధపడటాన్ని గమనించింది. శస్త్రచికిత్స చేయించుకునే స్తోమత లేక ఇబ్బందులు పడుతున్నారని చిన్నాన్న చెప్పడంతో ఆమె మనసు చలించిపోయింది. వెంటనే తను 500 మందికి శస్త్ర చికిత్సలు చేయిస్తానని చెప్పింది.

విరాళాల సేకరణ...
నైజీరియాకు వెళ్లిన తర్వాత స్నేహితులతో పాటు అక్కడ ఉంటున్న భారతీయుల దగ్గరకు వెళ్లి ‘హోప్‌ ఫర్‌ సైట్‌’ పేరుతో విరాళాలను సేకరించడం మొదలుపెట్టింది. ఇలా రూ.5 లక్షలు జమ చేసింది. తర్వాత బెల్లంపల్లిలోని కంటి ఆసుపత్రికి వచ్చి విడతల వారీగా 500 మంది వృద్ధులకు శస్త్ర చికిత్సలు చేయించింది. ‘కంటి సమస్యలు ఉన్న పేద వృద్ధులకు ఉచితంగా శస్త్ర చికిత్సలు చేయించడం ఎంతో సంతృప్తినిచ్చింది’ అంటోంది లక్ష్మి. ఇదే స్ఫూర్తితో ప్రస్తుతం ఆమె నైజీరియాలోనూ  రూ.25 లక్షల విరాళాలను సేకరించింది. అక్కడ సుమారు 500 మందికి శస్త్రచికిత్సలు చేయించడానికి సిద్ధమైంది.

- ముత్తె వెంకటేష్‌ న్యూస్‌టుడే, బెల్లంపల్లి పట్టణం


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని