జుట్టుకీ, చర్మానికీ.. గ్లిజరిన్‌!
close
Published : 24/08/2021 00:27 IST

జుట్టుకీ, చర్మానికీ.. గ్లిజరిన్‌!

వర్షాకాలంలో చర్మం పొడిబారడం, జుట్టు మెరుపును కోల్పోవడం చూస్తుంటాం. ఫలితమే.. యాక్నే, అలర్జీ, ఇన్ఫెక్షన్లు. వీటికి గ్లిజరిన్‌తో పరిష్కారం చెప్పేయొచ్చు.. ఇలా!

క టేబుల్‌ స్పూను ముల్తానీ మట్టికి రెండు టేబుల్‌ స్పూన్ల రోజ్‌వాటర్‌, అర స్పూను గ్లిజరిన్‌ కలిపి ముఖానికి పట్టించాలి. 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇది చర్మాన్ని మాయిశ్చరైజ్‌ చేయడంతోపాటు మెరిపిస్తుంది.

అరటిపండు గుజ్జులో ఒక టేబుల్‌ స్పూన్‌ అలొవెరా గుజ్జు, అరచెంచా గ్లిజరిన్‌, రెండు టేబుల్‌ స్పూన్ల కొబ్బరిపాలు కలిపి తలకు పట్టించాలి. ఇరవై నిమిషాల తర్వాత గాఢత తక్కువున్న షాంపూతో కడిగేస్తే సరి. జుట్టును కుదుళ్ల నుంచి చివరి వరకూ తేమనందించి ఆరోగ్యంగా ఉంచుతుంది.

రోజ్‌వాటర్‌, కొబ్బరి నూనె అర కప్పు చొప్పున, అలోవీరా గుజ్జు, బాదం నూనెలను పావు కప్పు చొప్పున తీసుకుని, వీటికి ఒక టేబుల్‌ స్పూన్‌ చొప్పున గ్లిజరిన్‌, ఇ విటమిన్‌ ఆయిల్‌ చేర్చి బాగా కలపాలి. దీన్ని రోజూ రాత్రిపూట మాయిశ్చరైజర్‌గా రాసుకుని చూడండి. చర్మానికి తేమను అందించడంతోపాటు యౌవ్వనంగా కనిపించేలానూ చేస్తుంది.మరిన్ని

తమ్మూ బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసా? 

ఉదయం లేవగానే కళ్లన్నీ వాచిపోయి, గాలిబుడగలా పఫ్ఫీగా తయారైన ముఖాన్ని చూసుకుంటే ఎక్కడలేని నిరుత్సాహం ఆవహిస్తుంది. ముందు రోజు పని ఒత్తిడి, నిద్రలేమి, తీసుకున్న ఆహారం.. తదితర కారణాల వల్ల ఈ సమస్య చాలామందిలో సహజమే! అయితే దీన్ని వదిలించుకోవాలంటే తానో సింపుల్‌ చిట్కాను పాటిస్తానంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ టిప్‌ అద్భుతంగా పనిచేస్తుందని స్వీయానుభవంతో చెబుతున్నానంటూ ఆ వీడియోను సైతం తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఇప్పుడనే కాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా, సోషల్‌ మీడియాలో తన సౌందర్య రహస్యాల్ని పంచుకుంటూ అమ్మాయిలందరికీ బ్యూటీ పాఠాలు నేర్పుతుంటుంది తమ్మూ.

తరువాయి

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని