అమ్మలూ అప్‌డేట్‌ అవ్వాలి!
close
Published : 26/07/2021 01:26 IST

అమ్మలూ అప్‌డేట్‌ అవ్వాలి!

చిన్నారుల పెంపకంలో అమ్మకు తెలిసినన్ని కిటుకులు మరెవరికీ తెలియదు. కానీ....టీనేజీ పిల్లలున్నప్పుడు మాత్రం కాస్త తడబాటు తప్పదు. వారిపై పట్టుకోల్పోకూడదంటే... కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం తప్పకపోవచ్చు.

గమనించండి... ఎదిగే పిల్లల ఇష్టాయిష్టాలను ఎప్పటికప్పుడు గమనించుకోగలిగితే చాలా సమస్యలకు చెక్‌పెట్టొచ్చు. ముఖ్యంగా వారి ఎంపికలను, సమీక్షలను, విమర్శలను ఒకింత పరిశీలనగా చూస్తూంటే...వారి వ్యక్తిత్వాన్ని పసిగట్టేయగలరు. దాన్ని బట్టే మంచీ, చెడు వారికి చెప్పగలరు.

నచ్చకపోయినా... కాలంతో పాటు మనమూ మారాలి. వారి స్టైల్‌, అలవాట్లు, స్నేహాలు...కాస్త ఇబ్బంది కలిగించొచ్చు.  వారు తీసుకునే నిర్ణయాలు ఏవైనా నచ్చకపోయినా సరే! వారి అభిప్రాయాల్ని గౌరవించండి. అలా వాటిని ఎంపిక చేసుకోవడంలో వారి ఉద్దేశం తెలుసుకోవడానికి ప్రయత్నించండి. తప్పుదారిలో నడుస్తుంటే మాత్రమే అడ్డు చెప్పడానికి వెనుకాడొద్దు. అప్పుడే వారు మీ మార్గంలో నడుస్తారు. 

మారండి... ప్రతి అమ్మానాన్నలూ...పిల్లలకోసమే జీవితాన్ని, కష్టాన్ని ధారపోస్తారు. అయితే మీరు చేసే ప్రతి పనిలో వారి ఇష్టాలూ ఇమిడి ఉండాలని మాత్రం మరిచిపోవద్దు. అప్పుడే వారు మీ త్యాగాన్ని, ఇబ్బందుల్ని అర్థం చేసుకుంటారు.

అందిపుచ్చుకోండి... కాలంతో పాటు లోకం పోకడా మారుతుంది. మీరు అలానే మారాల్సిన అవసరం లేదు...కానీ మార్పుని గుర్తించండి. మీ ఆలోచనలు, ఇష్టాయిష్టాలు...పిల్లలకి పాతచింతకాయ పచ్చడిలా ఉండొచ్చు. అంతమాత్రాన మీరంటే ఇష్టం లేదనీ, మిమ్మల్ని లెక్కచేయడం లేదనీ కాదు...మీరే వారిలా ఆలోచించడానికి ప్రయత్నించండి. అవన్నీ వారినే అడిగి తెలుసుకోండి. ఇవన్నీ పిల్లల ఆలోచనల్ని అందిపుచ్చుకునేందుకు సాయం చేస్తాయి.

మరిన్ని

పిల్లలకు ఆ నైపుణ్యాలు ఒంటబట్టాలంటే..!

ఇలాంటి సూపర్‌ యాక్టివ్‌ కిడ్స్‌ని చూసి తమ పిల్లల్నీ ఇలా చురుగ్గా తీర్చిదిద్దాలని అనుకోని తల్లిదండ్రులుండరంటే అతిశయోక్తి కాదు. అందుకే ప్రస్తుతం తమ పిల్లలు పాఠ్యాంశాలతో కుస్తీ పట్టడమే కాదు.. కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌.. వంటి అంశాల్లోనూ పట్టు సాధించాలని ఆరాటపడుతున్నారు ఈ తరం తల్లిదండ్రులు. వారిని ఆ దిశగానే ప్రోత్సహిస్తున్నారు కూడా! అయితే మహాసముద్రమంత జీకే సబ్జెక్టును ఒంటబట్టించుకోవడం.. అదీ అంత చిన్న వయసులో అంటే మాటలు కాదు. కానీ తల్లిదండ్రులు పిల్లలకు కాస్త సహకరిస్తే ఆ సమాచారమంతా వారు తమ చిన్ని బుర్రలో పదిలపరచుకుంటారని చెబుతున్నారు నిపుణులు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

దాని గురించి పుట్టిన వెంటనే తెలిసిపోతుందట!

తల్లిపాలు అందుతున్న పాపనో.. బాబునో.. అమ్మకు దగ్గరగా తీసుకువెళ్లండి.. వారంతట వారే తల్లి స్తన్యాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. రొమ్ముని అందుకొని తాగేంతవరకు తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తుంటారు. అయితే ఈ లక్షణం చిన్నారుల్లో ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? అమ్మపేగు తెంచుకొన్న మరుక్షణమే తల్లిపాల కోసం ఆరాటపడుతుంటారు. ఇంకా వూహ సైతం తెలియని వారు తమ తల్లిని గుర్తుపట్టడం మాత్రమే కాదు.. పాలు ఎక్కడ నుంచి వస్తాయో కూడా తెలుసుకొంటారు. మరి దీనికి కారణం ఏమిటి? చిన్నారులు ఇలా చేయడం మంచిదేనా? అది వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందా? వంటి విషయాలు తెలుసుకొందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని