ఆ ఫొటోకు నాలుగు గంటలు పట్టింది...
close
Updated : 14/06/2021 17:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ ఫొటోకు నాలుగు గంటలు పట్టింది...

అప్పుడే పుట్టిన నవజాత శిశువును ఆమె చేతుల్లోకి తీసుకుంటే చాలు...  కెమెరా లెన్స్‌కు ఫోజులిచ్చేస్తారు. తను కూడా ఆ బోసినవ్వులను ఫ్రేంలో బంధించడానికి గంటల తరబడి ఎదురుచూసి మరీ తాననుకున్నది సాధిస్తుంది. పసిపిల్లల కేరింతలను ఫ్రేంలో బిగించి అందమైన జ్ఞాపకంగా అందిస్తుంది. ఆ సృజనాత్మకతకే ఇటీవల మెల్‌బోర్న్‌కు చెందిన ఓ సంస్థ నుంచి అవార్డుని అందుకుంది. ఆమే హైదరాబాద్‌కు చెందిన ముప్పైఏళ్ల మధు వెనిగెళ్ల.

గుంటూరులో ఎమ్‌ఏ ఇంగ్లిష్‌ లిటరేచర్‌ పూర్తిచేసింది మధు. తండ్రి వెంకటేశ్వరరావు ప్రభుత్వపాఠశాలలో డ్రాయింగ్‌ టీచర్‌, తల్లి రామతులసి గృహిణి. చిత్రలేఖనంపై ఆసక్తిని పెంచుకున్న మధుకి నాన్నే గురువు. దాంతోపాటు ఫోన్‌ దొరికితే చాలు, ఫొటోలు తీయడం అలవాటు. నాలుగున్నరేళ్లక్రితం ప్రొఫెషనల్‌ ఫొటోగ్రాఫర్‌ చందన్‌కుమార్‌తో పెళ్లికావడంతో హైదరాబాద్‌కు వచ్చిందీమె.

చిన్న బొమ్మతో
‘పెళ్లైన ఏడాదికే బాబు పుట్టడంతో వాడి ఫొటోలు తీయడమే నా సాధనలో భాగమైంది. మొదటి మూడు నాలుగు నెలలు కెమెరాలో భాగాల గురించి తెలుసుకోవడానికే సరిపోయింది. ఆ తర్వాత మా బాబును ఫొటోలు తీసేదాన్ని. నాకు కిడ్స్‌ ఫొటోగ్రఫీ చాలా ఇష్టం. చిన్నపిల్లలను కెమెరా ఫ్రేంలో బిగించడమంటే చాలా కష్టం. నేనూ ప్రొఫెషనల్‌ ఫొటోగ్రాఫర్‌ అవ్వాలనుకున్నా. మా వారికి చెప్పి తన దగ్గరే శిక్షణ తీసుకుంటానన్నా. దాంతో తను ఓ బొమ్మను కొనిచ్చి ఆరునెలల పాటు సాధన చేయించారు. ఆ తర్వాత ఓ స్నేహితురాలికి డెలివరీ అయితే ఆ పుట్టిన బాబును ఫొటోలు తీసి కానుకగా ఇచ్చా. అవి చాలా బాగున్నాయని మెచ్చుకున్నారు. అలా నా కెరియర్‌ మొదలైంది.

ఇప్పటివరకు వందమందికిపైగా పిల్లల ఫొటోలు తీశా. నవజాత శిశువు నుంచి పదేళ్లలోపు చిన్నారుల వరకూ ఫొటోషూట్లు చేశా. కొన్నిసార్లు ఆసుపత్రికి వెళ్లి మరీ తీస్తుంటా. ఒక్కొక్కరికి 40 నుంచి 50 ఫొటోలు తీయాల్సి ఉంటుంది. ఒక షూట్‌కు ఒక్కోసారి రోజంతా పడుతుంది. నేను అనుకున్నట్లుగా ఫొటో రావడానికి మూడుగంటలకు పైగా ఎదురుచూసిన సందర్భాలూ ఉన్నాయి. కొందరు పిల్లలు అప్పటి వరకు నవ్వుతూనే ఉంటారు. ఫొటో తీసే క్షణానికి ఏడవడం మొదలుపెడతారు. వాళ్లని బుజ్జగించి, నవ్వించగలగాలి. ఈ ప్రొఫెషన్‌కు చాలా సహనం కావాలి. నాకొక అసిస్టెంట్‌ ఉన్నాడు! వాడే మా మూడేళ్ల బాబు బవిన్‌. తను నాతోనే ఉంటాడు. ఫొటో తీసే చిన్నారులు ఏడుస్తుంటే వాళ్లను నవ్వించి ఆడిస్తూ ఉంటాడు. పిల్లలకు వేయాల్సిన దుస్తులు, బ్యాక్‌గ్రౌండ్‌ నుంచి థీం వరకు సృజనాత్మకతతో ఆలోచిస్తేనే  ఫొటో అద్భుతంగా, అనుకున్నట్లుగా వస్తుంది. అలా ఓసారి ఏడాది బాబును చెవుల పిల్లులతో కలిపి తీసిన సందర్భం మాత్రం గుర్తుండిపోయే అనుభవం. కోడిపిల్లలు, పెట్‌డాగ్స్‌, బాతులు వంటి జంతువులతో పిల్లలను తీసే ఫొటోలు చాలా బాగుంటాయి. అవి   క్లయింట్లకు నచ్చుతాయి. సూపర్‌ మ్యాన్‌, వండర్‌ విమెన్‌, కెప్టెన్‌ అమెరికా వంటి ప్రత్యేక థీం ప్రకారం కూడా వెళుతుంటా. విజయవాడ, గుంటూరు, బెంగళూరు, రాజమండ్రి వంటి దూరప్రాంతాలకూ వెళ్లి ఫొటోలు తీస్తున్నా.

నాకు అవార్డు వచ్చిన ఫొటో పదిరోజుల వయసున్న పాపది. తనను నా ఒళ్లో ఉంచుకుని నవ్వే వరకు ఎదురుచూశా. తన చిరునవ్వును క్యాచ్‌ చేయడానికి నాలుగు గంటలు పట్టింది. ఆ సమయాన్ని వీడియో కూడా తీశాం. దాన్ని మెల్‌బోర్న్‌ ఫిమేల్‌ ఫొటోగ్రాఫర్స్‌ అసోసియేషన్‌ పోటీకి పంపా. ఆ ఫొటోకు ‘ద న్యూ జనరేషన్‌ ఫిమేల్‌ ఫొటోగ్రాఫర్‌’ అవార్డును అందించిన ఆ సంస్థ, ‘ఆ ఫొటో వెయ్యి జ్ఞాపకాలను అందించే అర్హత గలది’ అంటూ ప్రశంసించడమే కాకుండా లక్షన్నర రూపాయల బహుమతినీ అందించింది. ఇది నా కెరియర్‌లో కొత్త ఉత్సాహాన్ని అందించింది’ అని చెబుతోన్న మధు నెలకు 30 షూట్స్‌కు పైగా తీస్తుంది.

మహిళలు తమ గళాలను వినియోగించే అధికారం సాధించాలి. అలాగే ఇతరులు వాటిని వినేలా ప్రేరేపించాలి.
- మేఘన్‌ మార్కెల్‌, నటి,  బ్రిటిష్‌ రాజ కుటుంబ సభ్యురాలు


మరిన్ని

ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!

నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా వసుంధర ఆమెతో ముచ్చటించింది.

‘స్పెల్లింగ్స్‌’ చెప్పి సెన్సేషనయ్యారు!

పిల్లల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్‌-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్‌ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్‌ గర్ల్‌.

కథ చెబుతాను... ఊ కొడతారా..!

రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్‌ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్‌. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్‌సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది!

ఆడవారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు... వారికి కావల్సిందల్లా కాసింత ప్రోత్సాహం. ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి సహకారం మాత్రం ఉంటే చాలు... అమ్మాయిలకు అసలు తిరుగుండదు. అన్నింటా విజయాలే సాధిస్తారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే 24 ఏళ్ల మావ్యా సూదన్‌. జమ్మూకశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువతి ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌గా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తంమీద ఈ అవకాశం దక్కించుకున్న 12 వ మహిళగా, మొదటి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిందీ యంగ్‌ సెన్సేషన్.

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని