ఆన్‌లైన్‌ లేదని.. ఆసరాగా నిలుస్తున్నారు
close
Updated : 24/08/2021 05:04 IST

ఆన్‌లైన్‌ లేదని.. ఆసరాగా నిలుస్తున్నారు

ఇప్పుడు స్కూలు, కళాశాల తేడా లేకుండా అందరివీ ‘తెర’గతులే. ఇంటర్నెట్‌, మొబైళ్లు తప్పనిసరి అయ్యాయి. మరి.. తిండే గగనమయ్యే మురికివాడల పిల్లలకు ఈ స్మార్ట్‌ చదువులు ఎలా సాధ్యం? ఇదే ఆలోచన వచ్చింది ముంబయికి చెందిన వనితా హర్జినా, ఆరియా గుప్తాలకి. పరిష్కారంగా ఒకరు టీచర్‌గా మారి బోధిస్తుంటే.. మరొకరు విరాళాలు సేకరించి ట్యాబ్లెట్లను అందించడంతోపాటు విద్య కొనసాగేలా తోడ్పడుతున్నారు.


ఒక్కరితో మొదలై..

ముంబయిలోని శాంటాక్రూజ్‌ రైల్వేస్టేషన్‌ దగ్గర్లోని భాజీవాడీ మురికివాడలను అక్రమ కట్టడాలుగా ప్రభుత్వం పరిగణిస్తోంది. దీంతో కరెంట్‌ సౌకర్యమే లేదు. ఇక ఆన్‌లైన్‌ చదువు అవకాశమేది? అక్కడి పిల్లల చదువు కొనసాగేలా చేస్తోంది.. వనితా హర్జినా

నిత గ్రాడ్యుయేషన్‌ చదువుతోంది. తండ్రిది అరకొర సంపాదనే అయినా చదువు దిశగా ప్రోత్సహించాడు. క్యాండిల్‌ వెలుగులోనే చదువుకునేది. పోయినేడాది ఆయన చనిపోయారు. గతంలో ఓ ఎన్‌జీవోలోని పిల్లలకు హిందీ, మరాఠీ బోధించేది వనిత. నెలవారీగా వాళ్లిచ్చే రూ.3000 జీతం చదువు కొనసాగించడానికి సాయపడింది. లాక్‌డౌన్‌ కారణంగా అదీ ఆగిపోయింది. ఒకరోజు ఒక బాబు ‘నాకు స్మార్ట్‌ఫోన్‌ లేదు. నేనెలా చదువుకోవాలి? నువ్వు చెబుతావా అక్కా?’ అని అడిగాడు. చదువుకోవాలన్న కోరిక ఉండీ, అవకాశం లేకపోవడం ఎంత బాధాకరమో తనకు తెలుసంటుంది వనిత. అందుకే ఆ అబ్బాయికి సాయం చేయాలనుకుంది. కరెంట్‌ సౌకర్యం లేదు, స్మార్ట్‌ఫోన్లు ఉన్న వారిని వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. ఉన్నా తల్లిదండ్రులు తాము చేసే పని ప్రదేశాల్లోనే ఛార్జింగ్‌ పెట్టుకోవాలి. దీంతో ఆ వాడలోని 20 కుటుంబాలకుపైగా పిల్లలంతా ఈమె దగ్గరికే రావడం మొదలుపెట్టారు. వనిత వాళ్లకి హిందీ, మరాఠీ చెబుతూ తన స్నేహితులను ఇతర సబ్జెక్టులకు బోధించమని అడిగింది. వాళ్లూ ముందుకొచ్చారు. ఈ పిల్లలు చదివే పాఠశాల టీచర్లకు విషయం తెలిసి ఈమెకు రోజువారీ పాఠ్యాంశాల వివరాలను పంపించడం మొదలుపెట్టారు. వాటి ఆధారంగా బోధన కొనసాగిస్తోంది. అందుకు ఆమె ఎంచుకున్న ప్రదేశం స్థానిక రైల్వేస్టేషన్‌. ఇది ఏటా వరద ముంపుకు గురయ్యే ప్రదేశం. దీంతో వర్షాలు పడినప్పుడు ఎవరో ఒకరి ఇంట్లో కొనసాగిస్తుంది. మరి ఇళ్లలోకీ వరద నీరొస్తే ఎలా అనేది ఇప్పుడు ఆమె ముందున్న ప్రశ్న!


ట్యాబ్లెట్లు అందించింది

పాఠశాల స్థాయి నుంచే సామాజిక సేవ చేస్తూ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేలా కృషి చేస్తోంది ఆరియా గుప్తా. నిధులు సేకరించి ట్యాబ్లెట్లు అందివ్వడమే కాకుండా పలు విధాలుగా విద్య కొనసాగించేలా ప్రోత్సహిస్తోంది కూడా.

ముంబయిలోని ఆదిత్య బిర్లా వరల్డ్‌ అకాడెమీలో ఇంటర్‌ రెండో ఏడాది చదువుతోంది ఆరియా గుప్తా. శ్రీశ్రీ రవిశంకర్‌ విద్యామందిర్‌ స్కూల్‌ సహకారంతో ‘ఫస్ట్‌ టెక్‌ ఛాలెంజ్‌’ పోటీ కోసం కమ్యూనిటీ అవుట్‌రీచ్‌ ప్రోగ్రాంలో భాగస్వామురాలైంది. ధారావి ప్రాంతంలో కొంతమంది విద్యార్థులను ఎంపిక చేసి, రోబో తయారీ, డిజైనింగ్‌లలో శిక్షణనిప్పించింది. 2018లో రోబోటిక్స్‌ గేమ్‌లో వాళ్లు పాల్గొనేలా చేసింది. దీనికోసం ఆన్‌లైన్‌ ఫండింగ్‌ ద్వారా రూ.5 లక్షలను సేకరించింది. ఉచితంగా బోధించడం, పాఠ్యాంశాల్లో సందేహాలను తీర్చడంలోనూ సాయపడేది. కొంతమంది వలంటీర్లూ తోడయ్యారు. కొవిడ్‌ నేపథ్యంలో చాలామంది ఆన్‌లైన్‌ తరగతులకు హాజరు కాలేకపోతున్నారని తెలుసుకుంది. వాళ్లతో మాట్లాడి, 15 మంది విద్యార్థులను ఎంపిక చేసింది. ‘వాళ్లకి క్రౌడ్‌ ఫండింగ్‌ ద్వారా డబ్బులు సేకరించి ట్యాబ్లెట్లు అందించాలనుకున్నా. ఇందుకు దాదాపు రూ.1,50 లక్షలు కావాలి. వీళ్ల పరిస్థితిని చెబుతూ ఆన్‌లైన్‌లో సాయం కోరా. రూ.97,998 నిధులు సమకూరాయి. వాటితో ట్యాబ్లెట్లు కొని,  అందించా. ఇప్పుడు వాళ్లు ఆన్‌లైన్‌ తరగతులకు హాజరవుతున్నారు. మరికొందరికీ ఈ సౌకర్యాన్ని అందించడానికి ప్రయత్నిస్తున్నా’ అని చెబుతున్న ఆరియా మరెన్నో సేవా కార్యక్రమాల్లోనూ పాలు పంచుకుంటోంది. మైనా మహిళా ఫౌండేషన్‌ తరఫున కొవిడ్‌-19 డిసెన్సిటైజేషన్‌ ప్రాజెక్ట్‌లో వలంటీర్‌. జై వకీల్‌ ఫౌండేషన్‌ ద్వారా పేద చిన్నారులకు ఉచితంగా తరగతులు నిర్వహించడంలో సాయపడుతోంది. టాటా ముంబయి మారథాన్‌లో పాల్గొని, గ్రామీణ విద్యార్థులకు విద్యనందించడానికి కావాల్సిన నిధుల సేకరణకు కృషి చేసింది. ప్రస్తుతం మహారాష్ట్రలోని ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపవుట్స్‌ వివరాలను సేకరిస్తోంది. ఇందుకు మధ్యాహ్న భోజన పథకం నిర్వహణలో లోపాలు, మూత్రశాలల సౌకర్యం లేకపోవడం వంటివన్నీ కారణాలని చెబుతోంది. ఈ సర్వేను త్వరలో నిర్వహించనున్న మైక్రోసాఫ్ట్‌ ఇమేజిన్‌ పోటీకి సమర్పించనుందీమె. దేశంలో ప్రభుత్వ విద్యా విధానాన్ని మెరుగుపరచడంలో ఇది తోడ్పడుతుందని భావిస్తోంది.మరిన్ని

ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!

నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా వసుంధర ఆమెతో ముచ్చటించింది.

తరువాయి

‘స్పెల్లింగ్స్‌’ చెప్పి సెన్సేషనయ్యారు!

పిల్లల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్‌-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్‌ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్‌ గర్ల్‌.

తరువాయి

కథ చెబుతాను... ఊ కొడతారా..!

రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్‌ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్‌. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్‌సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది!

ఆడవారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు... వారికి కావల్సిందల్లా కాసింత ప్రోత్సాహం. ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి సహకారం మాత్రం ఉంటే చాలు... అమ్మాయిలకు అసలు తిరుగుండదు. అన్నింటా విజయాలే సాధిస్తారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే 24 ఏళ్ల మావ్యా సూదన్‌. జమ్మూకశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువతి ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌గా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తంమీద ఈ అవకాశం దక్కించుకున్న 12 వ మహిళగా, మొదటి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిందీ యంగ్‌ సెన్సేషన్.

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని