ఏ నీళ్లు తాగాలో చెబుతా!
close
Published : 15/09/2021 02:03 IST

ఏ నీళ్లు తాగాలో చెబుతా!

నీటిలో ఎన్ని రుచులుంటాయి? ఏంటీ పైకీ కిందకీ చూస్తున్నారు? వెటకారం కాదు.. సీరియస్సే! సరే.. ఉప్పు, తీపి అంటారా! కానీ ఇదే ప్రశ్నను లక్షితను అడిగితే.. బోలెడు రకాలున్నాయంటుంది. టకటకా వాటిని వివరించేస్తుంది. అంతేనా! ఏ ఆహారానికి ఏ నీటిని తీసుకోవాలో సూచిస్తుంది కూడా. ఇలా చెప్పేవాళ్లని ‘సమెలియర్‌’ అంటారు. ఎవరీవిడ అంటారా? అయితే చదివేయండి.

క్షిత నిఫ్ట్‌-దిల్లీ నుంచి ఫ్యాషన్‌ జర్నలిజంలో డిగ్రీ చదివింది. మిలాన్‌లోని మరంగోనీ ఇన్‌స్టిట్యూట్‌ నుంచి డిజైనింగ్‌ కోర్సూ పూర్తి చేసింది. ఆమె తండ్రిది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం. కొన్నాళ్లు ఆయనతో కలిసి పనిచేసింది. కానీ.. అది ఆసక్తిగా అనిపించలేదు. మనసుకు నచ్చిన పని చేయాలనుకుంది. ఓసారి బిజినెస్‌లో భాగంగా భూటాన్‌ వెళ్లింది. ట్రెకింగ్‌ చేస్తున్నపుడు ఓ చోట పారుతున్న నీటిని తాగింది. కొత్తగా, రుచిగా అనిపించాయి. అప్పటికే  తను ప్రపంచంలో తొలి సర్టిఫైడ్‌ సమెలియర్స్‌ మార్టిన్‌ రీజ్‌, మాషాలను కొంత కాలంగా అనుసరిస్తోంది. తనూ వాళ్ల దారిలో వెళ్తే బాగుంటుందనుకుంది.

చాలా మందికి సురక్షిత నీరు దొరకడమే గగనమైంది. ఒకవైపు సహజ వనరులు అడుగంటుతున్నాయి. మరికొన్నిచోట్ల కలుషిత మవుతున్నాయి. ఇవి ఒకెత్తయితే, తాగే నీరు, దాని ప్రత్యేకతలు వంటి వాటిపై క్రమంగా అవగాహన పెరుగుతోంది. ఆ క్రమంలో వాటర్‌ సమెలియర్స్‌కి ఆదరణ పెరుగుతుండటాన్ని గమనించి, తనూ ఆ కోర్సు చదవాలనుకుంది. అలా రీజ్‌, మాషా నిర్వహిస్తోన్న ‘ఫైన్‌ వాటర్‌ అకాడమీ’లో సర్టిఫికేషన్‌ కోర్సు చేసింది. మన దేశంలోనే ‘తొలి సర్టిఫైడ్‌ మహిళా సమెలియర్‌’గా నిలిచింది. ఈ పరిజ్ఞానంతో ‘బోధ్‌’ పేరిట సంస్థను స్థాపించింది. హిమాలయాల్లో 7300 అడుగుల ఎత్తులో పారో ప్రాంతం నుంచి సేకరించిన నీటిని బాటిళ్ల ద్వారా అందిస్తోంది. ఇక్కడ మానవ సంచారం ఉండదు. అంటే ఎవరూ తాకలేని నీటిని అందిస్తోందన్న మాట. వీటిని ఇప్పటికే భూటాన్‌లో అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు తన వ్యాపారాన్ని మన దేశంలోనూ విస్తరిస్తోంది.

‘తినే ఆహారాన్ని బట్టి నీటిని సూచిస్తా అని చెప్పినప్పుడు చాలామంది ‘ఏంటి జోకా’ అంటుంటారు. అసలు నీటిలో తేడాలేంటి అని ఆశ్చర్యపోతారు. తారలు, క్రికెటర్లను చూడండి. వేలు, లక్షలు పోసి నీటిని ప్రత్యేకంగా తెప్పించుకుంటుంటారు. ఎందుకు? వాటిలో ఏదో ప్రత్యేకత ఉందన్నట్టేగా! చూడటానికి ఒకేలా కనిపించినా పీహెచ్‌ స్థాయులు, మినరల్స్‌ శాతం మొదలైన అంశాల ఆధారంగా నీటిలో తేడాలుంటాయి. వాటినే నేనూ సూచిస్తా. ఉదాహరణకు - మీరో సలాడ్‌ను తిన్నారు.. దానిలో మెగ్నీషియం స్థాయులు ఎక్కువగా ఉన్నాయనుకోండి. అప్పుడు అది తక్కువగా, ఇతర మినరల్స్‌ ఎక్కువగా ఉండే నీటిని తాగమంటా. భారతీయ వంటకాలు సాధారణంగా కొంచెం కారంగా, ఘాటుగా ఉంటాయి. వీటికి ఫిజీ నీటిని సూచిస్తా. దీనిలో సిలికా ఎక్కువ. అది తాగితే నోరు కాస్త తియ్యగా అనిపిస్తుంది. బటర్‌ చికెన్‌/ పనీర్‌కి స్పెయిన్‌లో దొరికే 22 ఆర్టెసియన్‌ నీరు మంచి కాంబినేషన్‌. రస్‌మలై, ఫిర్నీ వంటి స్వీట్లకు నార్వేలోని స్వల్బర్దీ నీరు సరిపోతుంది. నీటిని ఎప్పుడూ చల్లగా తీసుకోకూడదు. దాని అసలు రుచి గది ఉష్ణోగ్రత వద్దే తెలుస్తుంది. నీరు ఎందులో తాగాలో చెప్పడం కూడా సమెలియర్ల విధే. కొన్ని లోహాలతో తయారు చేసిన గ్లాసులు రుచిని మార్చేయగలవు తెలుసా? త్వరలో మార్టిన్‌ రీజ్‌తో కలిసి బ్లాగును రూపొందించే ఆలోచనలో ఉన్నా. పర్యావరణహిత పద్ధతుల్లో నీటిరీసైక్లింగ్‌ విధానాలను దీనిలో పొందుపరుస్తాం. ఆతిథ్య రంగానికి అనుకూలమైన మెన్యూలను తయారు చేసే కృషిలో ఉన్నా’ నంటోంది లక్షిత ఖన్నా. ఉత్తర ధ్రువంలో లభించే స్వల్బర్ది, స్లొవెనియా నీరు తాను రుచి చూసిన వాటిల్లో అత్యుత్తమమైనవని చెబుతోంది. వీటిల్లో మెగ్నీషియం స్థాయులు ఎక్కువట. భూటాన్‌లోని నీటిలో నైట్రేట్‌ స్థాయులు ఎక్కువట. జల వనరుల రక్షణ, వాటర్‌ రీసైక్లింగ్‌ల గురించి విస్తృతంగా ప్రచారం చేస్తోంది. దాంతోపాటు తన వ్యాపారాన్నీ ప్రపంచవ్యాప్తం చేసే పనిలో ఉంది. భూటాన్‌ ప్రభుత్వం కూడా ఇతర నీటి వనరులను కనుక్కోవడంలో తన సాయం తీసుకుంటోంది.

మరిన్ని

ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!

నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా వసుంధర ఆమెతో ముచ్చటించింది.

తరువాయి

‘స్పెల్లింగ్స్‌’ చెప్పి సెన్సేషనయ్యారు!

పిల్లల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్‌-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్‌ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్‌ గర్ల్‌.

తరువాయి

కథ చెబుతాను... ఊ కొడతారా..!

రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్‌ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్‌. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్‌సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది!

ఆడవారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు... వారికి కావల్సిందల్లా కాసింత ప్రోత్సాహం. ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి సహకారం మాత్రం ఉంటే చాలు... అమ్మాయిలకు అసలు తిరుగుండదు. అన్నింటా విజయాలే సాధిస్తారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే 24 ఏళ్ల మావ్యా సూదన్‌. జమ్మూకశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువతి ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌గా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తంమీద ఈ అవకాశం దక్కించుకున్న 12 వ మహిళగా, మొదటి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిందీ యంగ్‌ సెన్సేషన్.

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని