అక్కడ నుంచి 42 సార్లు దూకా!
close
Updated : 22/09/2021 13:34 IST

అక్కడ నుంచి 42 సార్లు దూకా!

పదంతస్తుల భవనంపైకెక్కి కిందకి చూడాలంటేనే కళ్లుతిరుగుతాయి చాలామందికి.. అలాంటిది 13,500 అడుగుల ఎత్తులోంచి కిందకి దూకాలంటే ఎంత గుండెధైర్యం ఉండాలి! హైదరాబాద్‌ అమ్మాయి స్ఫూర్తి ఇలాంటి సాహసాన్ని 42 సార్లు చేసింది. అందుకే స్కైడైవింగ్‌లో యూఎస్‌పీఏ లైసెన్సు పొందిన మొదటి తెలుగమ్మాయిగా ప్రత్యేకతను సాధించుకుంది. డైవింగ్‌లో తనకెదురైన అనుభవాలను వసుంధరతో ఇలా పంచుకుంది..

నాన్న ఆర్మీ ఆఫీసర్‌ కల్నల్‌ కేజేఎం రాయ్‌, అమ్మ మాలతి. నాన్న ఉద్యోగరీత్యా నేనూ దేశమంతా తిరగాల్సి వచ్చింది. ఆ సమయంలోనే ఆటలూ, సాహసాలపై ఇష్టం పెరిగింది. బంజీజంప్‌, స్కైడైవింగ్‌, హాట్‌ ఎయిర్‌ బెలూనింగ్‌, టెరిటోరియల్‌ పారాసెయిలింగ్‌వంటి సాహసాలను ప్రయత్నించాను. అమ్మో అవన్నీ చేయడానికి భయమెయ్యదా అని మీరు అనుకోవచ్చు. నాకూ చిన్నప్పుడు ఇవంటే భయమే. పదమూడేళ్లప్పుడు అనుకుంటా... నేను ఏడో తరగతిలో ఉండగా గుర్రపుస్వారీ నేర్చుకునే అవకాశం దక్కింది. మరోసారి రిషీకేశ్‌లో బంజీజంప్‌ చేశా. ఇవి చేయడానికి మొదట్లో చాలా భయపడ్డా కానీ ఒక్కసారి చేసిన తర్వాత అవంటే భయం తగ్గి కొత్త సాహసాలు చేయాలనే ఆసక్తి మొదలైంది. అలా చేస్తూ ఉన్నప్పుడు ప్రకృతితో.. ముఖ్యంగా రయ్యిన వీచే గాలితో ఓ అనుబంధాన్ని పెంచుకున్నా. అందుకే గాల్లో చేసే సాహసాలంటే ప్రత్యేకమైన ఇష్టం కలిగింది. పుణెలో ఎంబీఏ పూర్తిచేసి, బెంగళూరులోని ఓ సంస్థలో హెచ్‌ఆర్‌ విభాగంలో జాబ్‌ చేస్తూనే ఎయిర్‌స్పోర్ట్స్‌లో అడుగుపెట్టా.

మొదటి సారే ప్రేమలో పడ్డా...  

మొదటిసారి స్కైడైవింగ్‌ను 2017లో గ్రీస్‌లోని ఏథెన్స్‌ సమీపంలో చేశా. దీనితర్వాతే నా అసలైన సాహస ప్రయాణం మొదలైంది. అమ్మా నాన్నలు ప్రోత్సహిస్తూనే జాగ్రత్తలు కూడా చెప్పేవారు. మొదటిసారి ఇన్‌స్ట్రక్టర్‌తో కలిసి స్కైడైవింగ్‌ చేసినప్పుడే సొంతంగా ఎగిరితే బాగుండు అని బలంగా అనిపించింది. అలా చేయాలంటే సోలో డైవింగ్‌లో అర్హత సాధించాలి. అందుకోసమే రష్యాలో యూఎస్‌పీఏ అఫిలియేషన్‌ ఉన్న డ్రాప్‌జోన్‌లో శిక్షణ పొందడానికి వెళ్లా. ఈ లైసెన్స్‌ సాధిస్తే ప్రపంచంలో ఎక్కడైనా సోలో స్కైడైవింగ్‌ చేయొచ్చు. అందుకే ఈ ఏడాది ఆగస్టులో ట్రైనింగ్‌ కోసం మాస్కో వెళ్లా. పారాచూట్‌ సాయంతో నేలమీదకు ల్యాండ్‌ అయ్యేలోపు మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉంటాయి. వీటన్నింటిపై పూర్తిగా శిక్షణనిచ్చిన తర్వాతే మనల్ని సోలో డైవింగ్‌కు అనుమతిస్తారు. అయితే ప్రతి చిన్నవిషయానికీ మనమే బాధ్యత వహించాలి. ఇన్‌స్ట్రక్టర్‌పై భారం వేసి రిలాక్స్‌ అవ్వడానికి లేదు. అందుకని చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. వాతావరణం బాగోకపోయినా, మబ్బులు, గాలి వీచే విధానంలో మార్పులున్నా శిక్షణాకాలం పెరుగుతుంది. ఎన్ని ప్రతికూలతలున్నా ఉత్సాహం, పట్టుదలతో మూడు వారాల్లో శిక్షణ పూర్తి చేసుకుని లైసెన్సు పొందాను.

సెకన్లలో స్పందించాలి...

ఇందుకోసం 13,500 అడుగుల ఎత్తు నుంచి 42 సార్లు దూకా. కిందకు దూకేటప్పుడు చిటికెన వేలు కదిపినా కూడా దిశ మారిపోతుంది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే అనుకున్న డ్రాప్‌జోన్‌కు చేరుకోగలుగుతాం. అలాగే పైనుంచి దూకిన తర్వాత ఫ్రీఫాల్‌ ఉంటుంది. ముందుగా నిర్ణయించుకున్న ఎత్తుకు చేరుకున్న తర్వాతే పారాచూట్‌ ఓపెన్‌ చేయాలి. మరొక విషయమేంటంటే... పారాచూట్‌ మనమే ప్యాక్‌ చేసుకోవడం, దాంతోనే కిందకు దూకి తిరిగి దాన్ని ఓపెన్‌ చేయడం నేర్చుకోవాలి. మన మెదడు వాతావరణానికి తగ్గట్లు సెకన్ల వ్యవధిలో వేగంగా స్పందించాలి. అంటే అంత ఏకాగ్రత ఉండాలి. అన్నీ పక్కాగా చేస్తే ఒక్కో జంప్‌ ఏడు నుంచి పది నిమిషాల్లో పూర్తవుతుంది. ఈ లైసెన్సును పొందిన వాళ్లలో దేశంలో నేను ఐదో సివిలియన్‌ మహిళను. తెలుగు రాష్ట్రాల్లో మొదటి అమ్మాయిని. ఇప్పుడు నాకు ప్రపంచంలో ఎక్కడైనా ఒంటరిగా జంప్‌ చేసే అర్హత వచ్చింది. అలాగే లైసెన్సు ఉన్న ఇతరులతో కలసి జట్టుగానూ చేయవచ్చు.

లక్ష్యాలూ పెరుగుతుంటాయి

కెరియర్‌, అభిరుచి, ఆశయానికి సంబంధించి సమన్వయం చేయడంలో ప్రతి అంశానికీ ప్రాముఖ్యతనిస్తా. ఇవన్నీ మనసుకు నచ్చినవి కావడంతో ఎంతో సంతోషాన్నిస్తాయి. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి నడక, గుర్రపుస్వారీ, స్క్వాష్‌ వంటివి చేస్తుంటా. నాకు ఒకే లక్ష్యం ఉండదు. చిన్నచిన్న గోల్స్‌ను దాటుతూ వెళుతుంటా. తిరిగి మరో లక్ష్యాన్ని సాధించడానికి కృషి చేస్తా.  రోజూ మన ఎదుగుదలలో మార్పు ఉంటుంది. దానికి తగినట్లుగా లక్ష్యాలు   పెరుగుతుంటాయని నమ్ముతా.మరిన్ని

ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!

నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా వసుంధర ఆమెతో ముచ్చటించింది.

తరువాయి

‘స్పెల్లింగ్స్‌’ చెప్పి సెన్సేషనయ్యారు!

పిల్లల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్‌-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్‌ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్‌ గర్ల్‌.

తరువాయి

కథ చెబుతాను... ఊ కొడతారా..!

రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్‌ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్‌. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్‌సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది!

ఆడవారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు... వారికి కావల్సిందల్లా కాసింత ప్రోత్సాహం. ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి సహకారం మాత్రం ఉంటే చాలు... అమ్మాయిలకు అసలు తిరుగుండదు. అన్నింటా విజయాలే సాధిస్తారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే 24 ఏళ్ల మావ్యా సూదన్‌. జమ్మూకశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువతి ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌గా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తంమీద ఈ అవకాశం దక్కించుకున్న 12 వ మహిళగా, మొదటి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిందీ యంగ్‌ సెన్సేషన్.

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని