మార్పులకు తగ్గట్టుగా.. మలచుకోండి!
close
Published : 02/07/2021 01:08 IST

మార్పులకు తగ్గట్టుగా.. మలచుకోండి!

కొవిడ్‌ తర్వాత పని వాతావరణం, చేసే తీరు రెండింట్లోనూ మార్పులొచ్చాయి. చదువు పూర్తి చేసుకుని, ఉద్యోగంలో చేరాలంటే వాటికి తగ్గట్టుగా సిద్ధమై ఉండటమూ తప్పనిసరి. మరి మీరు సిద్ధమేనా? చెక్‌ చేసుకోండి.
* రిమోట్‌ వర్కింగ్‌: ఇప్పుడు పనంతా ఇంటి నుంచే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కమ్యూనికేషన్‌ దగ్గర్నుంచి పని పూర్తయ్యేవరకు ప్రతిదానికీ టెక్నాలజీ అవసరం తప్పనిసరి. కాబట్టి, ఎంచుకున్న రంగంతో సంబంధం లేకుండా సాంకేతికతను అందిపుచ్చుకోవాల్సిందే. పని ప్రదేశంలో ప్రాథమికంగా ఏమేం అవసరమో తెలుసుకుని వాటిని నేర్చుకోండి.
* వర్చువల్‌గా: వీడియో కాలింగ్‌ ఇప్పుడు ప్రతి ఒక్కరికీ పరిచయమే. ఇప్పుడు ఇంటర్వ్యూ, కాన్ఫరెన్సులనూ ఈ విధానంలోనే నిర్వహిస్తున్నారు. ఇక్కడా శరీర భాష, ముఖ కవళికలకు ప్రాముఖ్యముంటుంది. వాటిని ముందుగానే పరిశీలించుకుని, సరిదిద్దుకోవాలి. అలాగే మాట్లాడటానికే కాదు.. ఓపికగా వినడానికీ సిద్ధమవ్వాలి. ఏం మాట్లాడాలో, మాట్లాడకూడదో తెలుసుకోవడంతోపాటు ఎదుటివారు చెప్పేదానికి ఎలా స్పందించాలో కూడా తెలుసుకోవాలి. ఆసక్తిగా వింటున్నారన్న అభిప్రాయాన్నీ కలిగించాలి.
* భాష: రంగంతో సంబంధం లేకుండా ఆంగ్లం తప్పనిసరి భాష అయ్యింది. వర్క్‌ ఫ్రం హోం వాతావరణంలో కమ్యూనికేషన్‌ అంతా ఈమెయిల్‌, మెసేజ్‌లు, ఫోన్ల ద్వారానే జరుగుతోంది. దీంతో భాషపై పట్టు ఉండాల్సిందే. దీంతోపాటు తక్కువ పదాల్లో అర్థవంతంగా చెప్పడానికీ ప్రాముఖ్యం పెరుగుతోంది. వీటిపైనా దృష్టిపెట్టండి. తెలుసుకోవడం, చదవడానికే పరిమితం కావొద్దు. తోటివారితో సాధన చేయండి. అప్పుడే వీటిపై పట్టు సాధిస్తారు.

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి

సైజ్‌ జీరో కాదు.. ఆరోగ్యం ముఖ్యం!

‘మనసులో కలిగే ఆలోచనల్నే శరీరం ప్రతిబింబిస్తుంది..’ అంటోంది ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అంకితా కొన్వర్‌. సైజ్‌ జీరో గురించి ఆలోచిస్తూ బాధపడితే మరింత బరువు పెరుగుతామని, అదే ఆరోగ్యంపై దృష్టి పెడితే శరీరం, మనసు రెండూ మన అధీనంలో ఉంటాయని చెబుతోంది. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెడుతూ.. ఆ చిట్కాల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అందరిలో స్ఫూర్తి నింపే ఈ మిసెస్‌ సోమన్‌.. తాజాగా బాడీ పాజిటివిటీ గురించి ఇన్‌స్టాలో మరో స్ఫూర్తిదాయక పోస్ట్‌ పెట్టింది. సైజ్‌ జీరో కంటే ఆరోగ్యమే ముఖ్యమంటూ ఆమె షేర్‌ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

తరువాయి

ఆఫీసులో కోపం కట్టలు తెంచుకుంటోందా? ఇలా చేసి చూడండి..!

ఉద్యోగినులకు ఇటు ఇంటి పనులు, అటు ఆఫీస్‌ ఒత్తిళ్లు సర్వసాధారణమే అయినా.. కొంతమంది వీటిని అదుపు చేసుకోలేక ఒక్కోసారి పని ప్రదేశంలోనే ఎదుటివారిపై విరుచుకుపడుతుంటారు. దీన్నే ‘వర్క్‌ప్లేస్‌ బర్నవుట్’గా పేర్కొంటున్నారు నిపుణులు. నిజానికి ఇలాంటి దీర్ఘకాలిక ఒత్తిడి ఆరోగ్యానికే కాదు.. కెరీర్ పైనా ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయంటున్నారు. అందుకే దీన్ని ఆదిలోనే గుర్తించి మేనేజ్‌ చేసుకోగలిగితే దీనివల్ల కెరీర్‌పై మచ్చ పడకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని