పరిధులు కాదు...అర్థం చేసుకోండి!
close
Published : 03/07/2021 00:54 IST

పరిధులు కాదు...అర్థం చేసుకోండి!

ఇప్పుడు అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలూ ఉద్యోగాలు చేస్తున్నారు. దాంతో ఎవరికి వారికి స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఒకింత ఎక్కువే ఉంటున్నాయి. పెళ్లయ్యాక అది అహంగా మారకుండా సర్దుబాట్లు చేసుకోవాలి. ఒకరినొకరు అర్థం చేసుకుని సాగిపోవాలి. అందుకు ఈ సూత్రాలు ఉపయోగపడతాయి.
పెళ్లికి ముందే ఒకరికొకరు అవతలి వారి పని విధానం, సమయం వంటివి తెలుసుకుని ఉంటే మేలు. లేదా పెళ్లయినా కొత్తలోనే ఆ పని చేయండి. దీనివల్ల ఇద్ద్దరి మధ్యా అవగాహన, సమన్వయం పెరిగి కలిసి పోగలుగుతారు.
* పెళ్లయ్యాక మీకు కొన్ని బాధ్యతలూ వస్తాయి. ఒకోసారి మీరెంత ఆలస్యంగా పడుకున్నా... పొద్దెక్కినా లేవదు అని భాగస్వామే అంటే చిరాకొస్తుంది. అర్థం చేసుకోవడం లేదనే బాధ మెలిపెడుతుంది. ఇది క్రమంగా గొడవలకు కారణం కావొచ్చు. అందుకే ఇద్దరి పని వేళల్నీ గమనించుకుంటూ... వాటికి అనుగుణంగా కనీసం ఎనిమిది గంటల నిద్ర ఉండేలా ప్రణాళిక వేసుకోండి. అప్పుడు అవతలివారూ అర్థం చేసుకోగలరు.
* మీరెంత పెద్ద ఉద్యోగైనా... ఇంటికీ, ఆఫీసుకీ మధ్య కచ్చితంగా గీత ఉండాలి. అలాకాకుండా ల్యాప్‌టాప్‌, ఫోన్‌లతో కాలం గడిపేస్తుంటే... అవతలివారు అభద్రతకు గురవుతారు. అన్నిసార్లూ ఆ పరిధులు నిర్ణయించుకోవడం కుదరకపోవచ్చు. దీంతో సెలవు రోజుల్లోనూ, అదనపు గంటలూ పని చేయాల్సి రావొచ్చు. ఆ పరిస్థితుల్ని అర్థం చేసుకోవడంలో మీరు విఫలమవ్వొద్దు. ఈ తీరు ఎదుటివారిలో ఒత్తిడి తగ్గిస్తుంది. మీ మధ్య అనుబంధాన్ని పెంచుతుంది.
* గౌరవించుకోండి.... వ్యక్తిగతంగా ఎవరికివారు వేర్వేరు చోట్ల పెరుగుతుంటారు. ఆయా పరిస్థితులకు అనుగణంగా వారి ఆహారపు అలవాట్లు, అభిరుచులు ఉండొచ్చు. దీన్ని మీరు గౌరవించి తీరాలి. అవతలివారికి స్వేచ్ఛ ఇవ్వడమూ మంచిది.

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి

సైజ్‌ జీరో కాదు.. ఆరోగ్యం ముఖ్యం!

‘మనసులో కలిగే ఆలోచనల్నే శరీరం ప్రతిబింబిస్తుంది..’ అంటోంది ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అంకితా కొన్వర్‌. సైజ్‌ జీరో గురించి ఆలోచిస్తూ బాధపడితే మరింత బరువు పెరుగుతామని, అదే ఆరోగ్యంపై దృష్టి పెడితే శరీరం, మనసు రెండూ మన అధీనంలో ఉంటాయని చెబుతోంది. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెడుతూ.. ఆ చిట్కాల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అందరిలో స్ఫూర్తి నింపే ఈ మిసెస్‌ సోమన్‌.. తాజాగా బాడీ పాజిటివిటీ గురించి ఇన్‌స్టాలో మరో స్ఫూర్తిదాయక పోస్ట్‌ పెట్టింది. సైజ్‌ జీరో కంటే ఆరోగ్యమే ముఖ్యమంటూ ఆమె షేర్‌ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

తరువాయి

ఆఫీసులో కోపం కట్టలు తెంచుకుంటోందా? ఇలా చేసి చూడండి..!

ఉద్యోగినులకు ఇటు ఇంటి పనులు, అటు ఆఫీస్‌ ఒత్తిళ్లు సర్వసాధారణమే అయినా.. కొంతమంది వీటిని అదుపు చేసుకోలేక ఒక్కోసారి పని ప్రదేశంలోనే ఎదుటివారిపై విరుచుకుపడుతుంటారు. దీన్నే ‘వర్క్‌ప్లేస్‌ బర్నవుట్’గా పేర్కొంటున్నారు నిపుణులు. నిజానికి ఇలాంటి దీర్ఘకాలిక ఒత్తిడి ఆరోగ్యానికే కాదు.. కెరీర్ పైనా ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయంటున్నారు. అందుకే దీన్ని ఆదిలోనే గుర్తించి మేనేజ్‌ చేసుకోగలిగితే దీనివల్ల కెరీర్‌పై మచ్చ పడకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని