తియతియ్యని లస్సీ తాగేద్దామా!
close
Published : 18/03/2021 00:28 IST

తియతియ్యని లస్సీ తాగేద్దామా!

ఎండలు ముదురుతున్నాయి. ఇలాంటి సమయంలో చల్లచల్లటి లస్సీ తాగితే ఆహా అనిపించకమానదు. దీన్ని ఈ కాలంలో క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బోలెడు లాభాలు. అవేంటో తెలుసుకుందామా...

స్సీని సాధారణంగా పెరుగుతో తయారుచేస్తాం. దీంట్లో క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్‌లాంటి అత్యావశ్యక మూలకాలతోపాటు ప్రొటీన్లు, విటమిన్లు మెండుగా ఉంటాయి. యాంటీబ్యాక్టీరియల్‌, యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.  
రక్తపోటు నియంత్రణలో...  
ఈ పానీయంలోని మెగ్నీషియం, పొటాషియం, ప్రొటీన్లు, యాంటీవైరల్‌, యాంటీబ్యాక్టీరియల్‌ సమ్మేళనాలు బీపీని నియంత్రిస్తాయి. కాబట్టి రక్తపోటు సమస్య ఉన్నవాళ్లు దీన్ని ఎంచక్కా తీసుకోవచ్చు.
రోగనిరోధకత పెరుగుతుంది..
పెరుగులోని పోషకాలు రోగనిరోధకతను పెంచుతాయి. లస్సీలోని జింక్‌ మూలకం శారీరక, మానసిక ఆరోగ్యాభివృద్ధికి తోడ్పడుతుంది. కాబట్టి రోజూ దీన్ని తీసుకుంటే సరి.
బరువు తగ్గేందుకు...
దీని నుంచి అందే కెలొరీలు చాలా తక్కువ. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు రోజూ తీసుకోవచ్చు. ఈ పానీయం తాగడం వల్ల తక్షణ శక్తి లభించడమే కాకుండా రోజంతా ఉత్సాహంగా ఉంటాం.
అసిడిటీని తగ్గిస్తుంది...
ఎండాకాలంలో ఎక్కువ కారం, మసాలాలు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. దాంతో కడుపులో మంట మొదలవుతుంది. ఇది తగ్గాలంటే చల్లటి మజ్జిగనే ముందు తీసుకోవాలి. దీన్ని తాగితే అజీర్తి, కడుపులో మంట, ఇబ్బందిగా ఉండటం.... లాంటి సమస్యలన్నీ తగ్గిపోతాయి.
పొట్టకు చల్లగా...
దీన్ని క్రమం తప్పకుండా తాగితే మలబద్ధకం సమస్య దరిచేరదు. అలాగే విరోచనాలతో బాధపడేవారు దీన్ని తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి