ఇంకెన్నాళ్లు?
close
Updated : 20/04/2021 02:52 IST

ఇంకెన్నాళ్లు?

ఈ మరణాలు ఆపలేమా?

ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం ప్రకారం గైనకాలజిస్టును కలిసే అవకాశం లేక కొందరు, అప్రమత్తత కరవై ఇంకొందరు... చనిపోతున్నారు. అధికరక్తపోటు, పోషకాహార లోపం, బాల్యవివాహాలు, లైంగిక వ్యాధులు, పునరుత్పత్తి ట్రాక్ట్‌ ఇన్‌ఫెక్షన్ల్లు వంటివీ ఇందుకు కారణాలే. అవాంఛిత గర్భాన్ని అడ్డుకునేందుకు మార్కెట్లో దొరికే మందులేవో మింగడం, నాటు వైద్యులు చెప్పిన ఆకుపసర్లు తాగడం, నాలుగు నెలలు దాటాక గర్భస్రావం చేయించుకోవడం, మంత్రసానులు చేసే కాన్పుల వంటివన్నీ మహిళల్ని ప్రమాదంలో పడేస్తున్నాయి. ప్రతి ప్రసవమూ నిపుణులైన వైద్యుల ఆధ]్వర్యంలోనే జరగాలని యునిసెఫ్‌ హెచ్చరిస్తోంది. ఆ అమ్మల ప్రాణాలు నిలపాలంటే ప్రభుత్వాల మద్దతు, ప్రజల్లో అప్రమత్తత అవసరం.

ప్రపంచ వ్యాప్తంగా ఏటా మరణిస్తున్న గర్భిణులు 5.50 లక్షలకు పైగా
మన దేశంలో... 1.36 లక్షలకు పైగా

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి