కరోనా పాజిటివ్ వచ్చింది.. నా పాపకు పాలివ్వచ్చా? - i got corona positive.. can i feed my baby
close
Updated : 22/06/2021 18:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా పాజిటివ్ వచ్చింది.. నా పాపకు పాలివ్వచ్చా?

హాయ్‌ మేడమ్‌.. నాకు మూడు నెలల పాప ఉంది. ఇటీవలే నాకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ప్రస్తుతం నేను నా బేబీకి పాలివ్వచ్చా? ఈ క్రమంలో నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

- ఓ సోదరి

జ: ఇటీవల పాజిటివ్‌ వచ్చిందన్నారు.. బహుశా ఈ పాటికి మీకు నెగెటివ్‌ వచ్చే ఉంటుంది. అయినా పాజిటివ్‌ వచ్చినా కూడా పాపకు పాలివ్వచ్చు.. కానీ ఈ క్రమంలో సరైన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మీరు తప్పనిసరిగా మాస్క్‌ ధరించడం, పాపను ముట్టుకునే ముందు చేతులు సబ్బు-నీటితో శుభ్రం చేసుకోవడం, చనుమొనలను తడిపిన దూదితో శుభ్రం చేసుకోవడం, పాలివ్వడం అయిపోయిన తర్వాత పాపను మీకు దూరంగా ఉంచడం.. వంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మీకు పూర్తిగా నెగెటివ్‌ వచ్చి డాక్టర్‌ మీ నుంచి వ్యాధి వ్యాపించే ప్రమాదం లేదని చెప్పేంత వరకు ఈ జాగ్రత్తలన్నీ తప్పనిసరిగా పాటించాలి.


మరిన్ని

యోగాలో ఈ పొరపాట్లు దొర్లకుండా..!

మానసిక ఒత్తిడి, టెన్షన్ల నుంచి తక్షణమే విముక్తి లభిస్తే బాగుండు.. అనిపిస్తోందా? అధిక పనితో అలసిపోయిన శరీరాన్ని శక్తిమంతం చేసుకోవాలనుకుంటున్నారా? ఇవన్నీ ఒకేసారి సాధ్యమైతే.. అంతకంటే ఆనందమేముంటుంది చెప్పండి.. అటు శారీరకంగా, ఇటు మానసికంగా సంపూర్ణ దృఢత్వాన్ని సాధించవచ్చు. ఇందుకు సహకరించే ప్రక్రియే 'యోగా'. అయితే ఈ యోగాసనాల వల్ల పూర్తి ఫలితం పొందాలంటే.. చేసే క్రమంలో ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా జాగ్రత్తపడాలి. కానీ కొంతమంది మాత్రం అవగాహన లోపంతో యోగా చేసేటప్పుడు కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. ఫలితంగా యోగా చేసిన ఫలం దక్కకుండా పోతుంది. మరి ఆ పొరపాట్లేంటో ముందే తెలుసుకుని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే పూర్తి ఫిట్‌నెస్‌ను సొంతం చేసుకోవచ్చు.

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని