Viral Video: డాగ్‌షోలో అదరగొట్టిన శునకం
close

Published : 16/06/2021 20:07 IST
Viral Video: డాగ్‌షోలో అదరగొట్టిన శునకం

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికాలో పాపులర్‌ అయిన శునకాల పోటీ ‘వెస్ట్‌ మినిస్టర్‌ డాగ్‌షో’. ఈ కార్యక్రమంలో శునకాలతో విన్యాసాలు చేయిస్తారు. 1877 నుంచి అమెరికాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఏటా 200 రకాలకుపైగా శునకాలు ఈ డాగ్‌షోలో పోటీ పడుతుంటాయి. ఈ ఏడాది 2,500 శునకాలతో పోటీ పడి ‘వసాబి’ అనే జూలు కుక్క విజేతగా నిలిచింది. అయితే విజేతగా మారిన వసాబి గురించి నెటిజన్లు పెద్దగా చర్చించుకోవడం లేదు గాని.. అదే కార్యక్రమంలో తన ప్రదర్శనతో మెప్పించిన బోస్టన్‌ టెర్రియర్‌ జాతికి చెందిన ఓ కుక్క గురించి మాత్రం తెగ మాట్లాడుకుంటున్నారు. ఇంతకూ ఇది ఏం చేసిందంటే.. తన యజమాని పొరపాటున కింద పడిపోయి తన దారికి అడ్డుపడినా, ఏమాత్రం కంగారుపడకుండా తన విన్యాసాలను పూర్తిచేసింది. దాంతో నెటిజన్లు శునకాన్ని తెగ పొగిడేస్తున్నారు. స్పోర్ట్స్‌నెట్‌ అనే యూట్యూబ్‌ ఛానెల్‌ దానికి సంబంధిచిన వీడియోను పంచుకోగా అది కాస్తా నెట్టింట్లో వైరల్‌గా మారింది.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని