Viral Video: పిల్ల ఏనుగు కోలాహలం!
close

Published : 18/06/2021 23:41 IST
Viral Video: పిల్ల ఏనుగు కోలాహలం!

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారీ జంతువులైన ఏనుగులు చిన్నతనంలో చాలా అల్లరి చేస్తాయి. వాటివల్ల అవి ఒక్కోసారి ప్రమాదంలో పడుతుంటాయి. అందుకని పిల్ల ఏనుగులు వేసే ప్రతి అడుగునూ తల్లి ఏనుగులు ఓ కంట కనిపెడుతూ, వాటికి రక్షణ కల్పిస్తాయి. చిన్నవి ఆడుకునే ప్రాంతం సురక్షితమైతేనే తల్లి ఏనుగులు వాటిని ఆడుకోనిస్తాయి. సరిగ్గా ఇలాంటి సంఘటనకు సంబంధించిన ఒక వీడియోను సుధా రామెన్‌ అనే అటవీశాఖ అధికారిణి ట్విటర్‌ ద్వారా పంచుకోగా, ఆ దృశ్యాలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఈ వీడియోలో ఓ పిల్ల ఏనుగు నదిలో దిగి ఆడుకుంటుండగా.. తల్లి, మరో ఏనుగు నదిలోని ప్రాంతం సురక్షితంగా ఉందా లేదా అని పరిశీలించాయి. తర్వాత ఏనుగు పిల్లను నీటిలోకి తీసుకెళ్లి కాసేపు ఆడించాయి.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని