Viral Video: చలువ కళ్లద్దాలు పెట్టుకుని పోజులిస్తున్న ఒరంగుటాన్‌
close

Published : 04/08/2021 13:44 IST
Viral Video: చలువ కళ్లద్దాలు పెట్టుకుని పోజులిస్తున్న ఒరంగుటాన్‌

ఇంటర్నెట్‌ డెస్క్: మనుషులకే కాదు.. మాకు కూడా స్టైల్‌గా ఉండటం తెలుసు అంటోంది ఈ వీడియోలోని ఒరంగుటాన్‌. ఇండోనేసియా బోగోర్‌లోని తమన్‌ సఫారిలో ఓ ఒరంగుటాన్‌కి చలువ కళ్లద్దాలు దొరకగా.. వాటిని కళ్లకు పెట్టుకుని పోజులిచ్చింది. ప్రస్తుతం ఆ దృశ్యాలు సామాజిక మాద్యమాల్లో తెగ వైరల్‌ అవుతున్నాయి. ఇండోనేసియాలోని తమన్‌ సఫారీని సందర్శించడానికి వచ్చిన లోలిత టెస్టు అనే మహిళ తన చలువ కళ్లద్దాలను ఎన్‌క్లోజర్‌లో జారవిడువగా.. తన పిల్లతో పాటు అక్కడే తిరుగుతున్న ఓ ఒరంగుటాన్‌ ఆ కళ్లద్దాలను తీసుకుని కళ్లకు పెట్టుకుని స్టైల్‌గా పోజులు ఇచ్చింది. ఈ క్రమంలో ఒరంగుటాన్‌ చేష్టలతో పర్యాటకులు ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన దృశ్యాలను లోలిత టెస్టు తన ఇన్‌స్టాగ్రాం ఖాతా ద్వారా పంచుకున్నారు. 


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని