
వార్తలు / కథనాలు
కరోనా వైరస్ మూలం తెలుసుకొనేందుకు పరిశోధకుల పాట్లు
ఇంటర్నెట్ డెస్క్: చైనాలో తొలిసారి వెలుగు చూసిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచమంతా పాకేసింది. సమస్త ప్రపంచాన్నీ తన గుప్పిట బంధించింది. ఈ మహమ్మారి నుంచి బయటపడేందుకు అన్ని దేశాలూ ఆంక్షలు అమలు చేస్తున్నాయి. ప్రజలు కఠిన నిబంధనలు పాటించాల్సి వస్తోంది. టీకా అభివృద్ధిపై ఔషధ సంస్థలు దృష్టిసారించాయి. వైరస్ పుట్టుక ఏంటి? ఎలా ఉత్పరివర్తనం చెందుతోంది? ఎక్కడ పుట్టింది? తొలిసారి ఎలా సంక్రమించింది? వంటి వివరాలను శాస్త్రవేత్తలు తెలుసుకుంటున్నారు.
థాయ్‌లాండ్ పరిశోధకులు సైతం ఇదే పని చేస్తున్నారు. కరోనా వైరస్‌కు మూలం నిజంగా గబ్బిలాలేనా? అన్న కోణంలో వారు పరిశోధన చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కొండకోనల్లో, గుహల్లో ఉన్న గబ్బిలాలను వేటాడుతున్నారు. అయితే చంపేయడానికి కాదు. వాటి నోటిలోంచి లాలాజలాన్ని సేకరించి వైరస్ గురించి పరిశోధన చేస్తున్నారు. ఇందుకోసం ఎంతో కష్టపడుతున్నారు. అందుకు ఈ చిత్రాలే నిదర్శనం. మీరూ ఓ లుక్కేయండి..!