Tuesday, February 09, 2016


Untitled Document
Comments
0
Recommend
0
Views
2
ఇక... అపురూప సొబగులు
ప్రతిపాదనలు పంపాలని రైల్వేశాఖ ఆదేశం
విలాసవంతమైన అత్యున్నత సౌకర్యాలు
భవనంలోనే వాణిజ్య సముదాయం
అనంతపురం(రైల్వే), న్యూస్‌టుడే: శిథిలావస్థకు చేరిన అనంతపురం రైల్వేస్టేషన్‌కు మహర్థశ కలగనుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో స్టేషన్‌ను నిర్వహించాలని రైల్వేశాఖ సంకల్పించింది. ఈమేరకు అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా ప్రణాళిక, స్టేషన్‌ నమూనా పంపాలని కిందిస్థాయి అధికారులను ఆదేశించారు. గుంతకల్లు డివిజన్‌లోని ఐదు రైల్వేస్టేషన్‌లను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్వహించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. తిరుపతి, అనంతపురం, కడప ఇందులో చేరాయి. తిరుపతి స్టేషన్‌లో ఇప్పటికే ప్రమాణాలు బాగున్నప్పటికీ మరిన్ని సౌకర్యాలను పెంచనున్నారు. ఇందులో ప్రైవేటీకరణ ఉండవచ్చని రైల్వేవర్గాలు భావిస్తున్నాయి. అనంతపురం, కడప రైల్వేస్టేషన్ల ప్రతిపాదనలపై రైల్వే బోర్డు పచ్చజెండా వూపాల్సి ఉంది. ఇప్పటికే అధికారులు రైల్వేస్టేషన్‌ ఆవరణ విస్తీర్ణం, స్టేషన్‌ భవనం నమూనాతో పాటు వాణిజ్య సముదాయాలను ఏ ప్రాంతంలో ఏర్పాటుచేయాలన్న విషయాలపై దృష్టిసారించారు. స్టేషన్‌ భవనం నుంచి రైల్వేశాఖకు ఆదాయ వనరులను పెంచుకోవాలని భావిస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాల స్టేషన్‌లో ప్లాట్‌ఫారాలు మారడానికి ఎస్కలేటర్లు, లిఫ్టులు, శీతల వేచి ఉండు గదులు, ఉన్నతశ్రేణి శీతల వేచి ఉండు గదులు, ఉన్నతశ్రేణి విశ్రాంత గదులు రానున్నాయి. బహుళ అంతస్థుల స్టేషన్‌ భవనాన్ని నిర్మించనున్నారు.

స్టేషన్‌ వివరాలివి
అనంత స్టేషన్‌ విస్తీర్ణం: 25 ఎకరాలు
ప్లాట్‌ఫారాలు: ప్రస్తుతం 4 (గూడ్సు పట్టాలతో)
భవిషత్తులో: 6 ప్లాట్‌ఫారాలకు అవకాశం
రైల్వే కాలనీ: 96 నివాసాలు
ఔటింగ్‌ స్టేషన్లు: తాటిచెర్ల, ప్రసన్నాయపల్లి
నగర జనాభా: 4 లక్షలు
రోజూ ప్రయాణికులు: 12 వేలు
సరుకు రవాణా: ఉద్యానపంటలు, వ్యాపార సరుకులు
సరుకు రవాణా రైళ్లు: నెలకు 5
ప్రయాణికుల రైళ్లు: 30(రోజు)
వారాంతపు రైళ్లు: 106(వారంలో)
అనంతపురం రైల్వేస్టేషన్‌ నగరం నడి నడిబొడ్డున ఉండటంతో వాణిజ్య భవనాలకు ప్రాధాన్యం అధికంగా ఉంటుంది. వాణిజ్యభవనాలను నిర్మించి, దుకాణాలు ఏర్పాటుచేస్తే రైల్వేశాఖకు ఆదాయ వనరులు పెరుగుతాయి. ప్రస్తుతం స్టేషన్‌లో 4 రైలుపట్టాల వరుసలు ఉన్నాయి. మరో మూడు మీటరు గేజు పట్టాలను తొలగించిన ప్రాంతంలో ఖాళీగా ఉంది. దీంతో 6 ప్లాట్‌ఫారాలు ఏర్పాటుకు అవకాశముంది. సరుకు రవాణా విభాగాన్ని ప్రసన్నాయపల్లికి తరలించడానికి రంగం సిద్ధంచేశారు. దక్షిణ భారత రాష్ట్రాల నుంచి ఉత్తర, ఈశాన్య రాష్ట్రాలకు కలిపే ప్రధాన రైళ్లు మార్గం కావడంతో రైళ్ల రాకపోకలు ఎక్కువగా ఉన్నాయి. రెండు వరుసల పట్టాలను ఏర్పాటుచేస్తే రైళ్ల సంఖ్య ఘణనీయంగా పెరగనుంది. బెంగళూరు నుంచి ముంబాయి, దిల్లీ, జమ్మూకాశ్మీర్‌ మొదలు హైదరాబాద్‌, నిజాముద్దీన్‌, విజయవాడ, విశాఖపట్నం, భువనేశ్వర్‌లకు ప్రధాన రైలు మార్గం కావడంతో ట్రాఫిక్‌ భవిషత్తులో ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని రైల్వే ఉన్నతాధికారులు భావిస్తున్నారు. అంతేకాక తాడిపత్రిలో సిమెంటు పరిశ్రమలు, ఉండటంతో సరుకు రవాణా డిమాండ్‌ ఎక్కువగా ఉంది. హిందూపురం ప్రాంతంలో పరిశ్రమలు వెలిస్తే రైలు ప్రయాణికుల సంఖ్య పెరుగుతుంది. వీటన్నింటి దృష్టిలో ఉంచుకొని అనంతపురం రైల్వేస్టేషన్‌ ప్రమాణాలను పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రతిపాదనలు రెండు, మూడు నెలల్లో రైల్వే బోర్డుకు జోనల్‌ అధికారులు పంపాల్సి ఉంది. బోర్డు పచ్చజెండా వూపితే అంతర్జాతీయ రైల్వేస్టేషన్‌గా మారనుంది.

Untitled Document
కొరవడిన పర్యవేక్షణ
30 కిలోలకు రెండు డబ్బాలు
చక్కెరకు ఒకటి.. బియ్యానికి మరొకటి
‘తూచ’ తప్పని దోపిడీ
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
అక్రమ రవాణాకు 1.40 లక్షల జరిమానా
పది కౌంట్‌డౌన్‌ ఆరంభం
దక్షిణభారత మండలి సాప్ట్‌బాల్‌ జట్టు ఇదే
రాష్ట్రస్థాయి విజేత భార్గవ్‌
416 మందికి ఉద్యోగానికి ఆన్‌‘లైన్‌’ పరీక్ష
గ్రంథాలయం విజ్ఞానానికి కేంద్రం
వర్సిటీ గుర్తింపుతో ఉద్యోగ భద్రత
దేశ పురోభివృద్ధిలో యువతే ప్రధాన భూమిక
సత్ఫలితాలిస్తున్న కలెక్టర్‌ ప్రయోగం
ఉద్యాన పంటకు తెగుళ్ల బెడద
కలెక్టరేట్‌లో రద్దీ తగ్గాలి
సర్వేయర్ల అవకతవకలపై ఫిర్యాదు చేయండి
నిరంతర నిఘా మార్కెటింగ్‌శాఖ ఏడీ నారాయణమూర్తి
పరపతేతర వ్యాపారాలతోనే సహకార సంఘాలకు మనుగడ
‘ఈనాడు’ క్రికెట్‌ రన్నరప్‌ జట్టుకు అభినందన
‘రైల్వే సంఘ్‌ సమ్మె’పై ఓటింగ్‌
లోక్‌అదాలత్‌లలో కేసులు పరిష్కరించుకోండి
యాడికి క్లష్టర్‌ అభివృద్ధికి చర్యలు చేపట్టాలి
కాపులను బీసీలుగా గుర్తించాలి
రైల్వే కార్మికుల సమ్మె బ్యాలెట్‌ ప్రారంభం
ప్రయాణికుల భద్రతకు పటిష్ట చర్యలు
కసాపురం ఆలయ సమాచారం
విద్యార్థికి శిక్షపై నిరసన!
ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య
మహిళా కార్మికులపై లైంగిక వేధింపులు..?
విద్యా ప్రమాణాల పెంపునకే నాక్‌ గుర్తింపు
 
  తాజా వార్తలు
  ప్రధాన వార్తలు
  ప్రత్యేక కథనాలు
Untitled Document
 
 
Untitled Document
 
 
 
Untitled Document
Copyright © 2015 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Marketing enquiries contact 9000180611 or Marketing@eenadu.net