వారంలో పలు ఆలయాలకు పాలకమండళ్లు

ప్రధానాంశాలు

వారంలో పలు ఆలయాలకు పాలకమండళ్లు

తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

కాణిపాకం, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలైన కాణిపాకం, శ్రీకాళహస్తి, శ్రీశైలం దేవస్థానాల పాలకమండళ్లను మరో వారం రోజుల్లో నియమించనున్నట్లు తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. స్వయంభు శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి వారికి తితిదే ఆధ్వర్యంలో రూపొందించిన స్వర్ణ రథం నిర్మాణం పనులు పూర్తయ్యాయని, దీన్ని త్వరలో అప్పగించనున్నట్లు చెప్పారు. రథం నిర్మాణ పనులను శనివారం ఆయన డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎమ్మెల్యే ఎంఎస్‌బాబుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ రథం నిర్మాణానికి కాణిపాకం ఆలయం తరఫున తితిదేకు రూ.6 కోట్లు చెల్లించారని తెలిపారు.


తితిదే బర్డ్‌ ట్రస్ట్‌కు రూ.1.10 కోట్ల విరాళం

తిరుమల, న్యూస్‌టుడే:  తితిదే బర్డ్‌ ట్రస్ట్‌కు చెన్నైకు చెందిన భక్తుడు బాలు రామజయన్‌ రూ.1.10 కోట్లు విరాళంగా అందించారు. విరాళానికి సంబంధించిన డీడీని శనివారం తితిదే అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ దాత అందజేసిన మొత్తంతో 200 ప్రత్యేక మంచాలు కొనుగోలు చేస్తామన్నారు. ఒక నెలలో వాటిని బర్డ్‌ ఆసుపత్రిలో రోగులకు అందుబాటులో ఉంచుతామని తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని