మూడు తరాలతో ముడిబడిన బంధం!

ప్రధానాంశాలు

మూడు తరాలతో ముడిబడిన బంధం!

ఈనాడు, విశాఖపట్నం: తండ్రీ కొడుకులిద్దరూ ఒకే పాఠశాలలో పనిచేయడం, అంతకుముందు వారిద్దరూ అదే బడిలో చదవడం, ఆ ఇంటి మూడో తరం కూడా అందులోనే చదువుతుండటం ఎంతో అరుదైన విషయం. అదీ.. ప్రభుత్వ పాఠశాల కావడం ఇంకా విశేషం. విశాఖపట్నం జిల్లా కె.కోటపాడు మండలం ఎ.కోడూరు మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల ఈ అరుదైన విశేషానికి వేదికైంది. ఈ బడి ప్రధానోపాధ్యాయుడు ఇ.మల్లేశ్వరరావు. ఆయన 1968 నుంచి 1973 వరకు ఇక్కడే చదువుకున్నాడు. 1986లో ఉపాధ్యాయ వృత్తిలో చేరి..ఈ ఏడాది ఎ.కోడూరుకు ప్రధానోపాధ్యాయునిగా బదిలీపై వచ్చారు. ఆయన కుమారుడు దుర్గాప్రవీణ్‌ ఈ పాఠశాలలోనే 1994 నుంచి 1999 వరకు చదువుకుని 2010లో ఉపాధ్యాయునిగా ఉద్యోగం సాధించారు. ఈ ఏడాది ఇదే పాఠశాలకు వచ్చారు. ఇప్పుడు తండ్రీకొడుకులిద్దరూ ఒకే బడిలో బోధిస్తున్నారు. దుర్గాప్రవీణ్‌ తన కుమారుడు శివ అనిరుధ్‌ని కూడా ఈ బడిలోనే ఒకటో తరగతిలో చేర్పించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని