తాజా వార్తలు

Facebook Share Twitter Share Comments Telegram Share
Mystery House On Moon: చంద్రుడిపై ఓ ‘మిస్టరీ హౌస్‌’?

ఇంటర్నెట్‌ డెస్క్‌: చంద్రుడి ఉపరితలంపై ఓ వింత వస్తువు కనిపిస్తోందన్న వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. చైనా 2019లో చంద్రుడిపైకి పంపిన ‘యుటు-2’ అనే రోవర్‌ ఇటీవల కొన్ని చిత్రాలు పంపింది. అందులో ఘనాకారంలో ఉన్న ఓ వస్తువు కనిపించినట్లు ఆండ్రూ జోన్స్‌ అనే స్పేస్‌ జర్నలిస్ట్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతానికి దీన్ని ‘మిస్టరీ హౌస్‌’గా వ్యవహరిస్తుండడం గమనార్హం.

యుటు-2 రోవర్‌ ‘వోన్‌ కార్మన్‌’ అనే క్రేటర్‌ దగ్గరికి వెళ్లినప్పుడు ఈ దృశ్యం కనిపించినట్లు ఆండ్రూ పేర్కొన్నారు. ప్రస్తుతం అది రోవర్‌కు 80 మీటర్ల దూరంలో ఉన్నట్లు తెలిపారు. అయితే, అది స్తంభమో లేక ఏలియనో కాదని పేర్కొన్నారు. మరైతే అది ఏంటనేది మాత్రం కచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మరో 2-3 ‘ల్యూనార్‌ డేస్‌’(దాదాపు 2-3 నెలలు)లో రోవర్‌ అక్కడికి చేరుకుంటుందని తెలిపారు. ఉల్కలు, గ్రహశకలాలు చంద్రుడిని ఢీకొట్టినప్పుడు పెద్ద పెద్ద రాళ్లు బయటపడుతుంటాయన్నారు. చైనా పంపిన ఛాంగ్‌ ఇ-3 మిషన్‌లోనూ ఇలాంటిది కనిపించినట్లు తెలిపారు. కానీ, అది ఓ పెద్ద బండరాయని తర్వాత తెలిసిందన్నారు.

ఇలా చంద్రుడికి సంబంధించి రోవర్లు పంపే చిత్రాల్లో ఏదో వింత ఆకారాలు కనిపించడం కొత్తేమీ కాదు. గతంలో యుటు-2 పంపిన ఫొటోల్లో ఆకుపచ్చ రంగులో జెల్‌ లాంటి పదార్థం ఒకటి కనిపించింది. తర్వాత జరిపిన పరిశోధనల్లో దాన్ని రాయిగా నిర్ధారించారు. ఇటీవల ఓ పెద్ద మేకు లాంటి ఆకారం కూడా కనిపించింది. అది కూడా రాయే అని తేలింది. ఆండ్రూ జేమ్స్‌.. చైనా అంతరిక్ష కార్యకలాపాల్ని రిపోర్ట్ చేస్తుంటారు. ప్రస్తుతం ఆయన స్పేస్‌.కామ్‌ అనే వార్తా సంస్థకు పనిచేస్తున్నారు.
మరిన్ని

దేవ‌తార్చ‌న

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.