కొలీజియం పునరుద్ఘాటిత పేర్ల వెల్లడిపై విచారణకు అంగీకారం

దిల్లీ: ఉన్నత న్యాయవ్యవస్థలో కొలీజియం పునరుద్ఘాటించిన పేర్లు, నియామకాల వెల్లడికి కేంద్ర ప్రభుత్వానికి తగు మార్గదర్శకాలు జారీ చేయాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. 2018లో ఓ ఎన్జీవో సంస్థ దాఖలు చేసిన ఈ పిటిషను ఇప్పటిదాకా విచారణకు రాని విషయాన్ని న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ హిమా కొహ్లీ, జస్టిస్‌ జేబీ పర్దీవాలాల ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. న్యాయమూర్తుల నియామకానికి అత్యున్నత న్యాయస్థానం కొలీజియం సిఫార్సు చేసిన పేర్లను కేంద్రం సకాలంంలో ఖరారు చేయకుండా తొక్కి పెడుతోందని పిటిషనరు తెలిపారు.


మరిన్ని