Pawan Kalyan: ‘హరి హర వీరమల్లు’ నుంచి అదిరిపోయే అప్‌డేట్‌...

హైదరాబాద్‌: పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్స్‌ ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’(Hari Hara Veera Mallu). ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన లుక్స్‌తో పవన్‌ అభిమానుల్లో ఫుల్‌ జోష్‌ నింపుతున్నారు. ఇక ఈ చిత్రం అప్‌డేట్స్‌ కోసం సినీ ప్రియులు తెగ వెతికేస్తున్నారు. తాజాగా చిత్రబృందం ఇచ్చిన అప్‌డేట్‌తో వారంతా ఖుషీ అవుతున్నారు. షూటింగ్‌ స్టిల్స్‌ విడుదల చేసి క్రేజీ న్యూస్‌ చెప్పింది చిత్రయూనిట్‌.

‘‘చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగిన నాణ్యమైన సినిమాను రూపొందించడం అంటే కాలానికి పరీక్షగా నిలుస్తుంది. ప్రతి విషయాన్ని వివరంగా చెప్పాలి. ఎంతో పరిశోధన చేయాలి. వందలమంది తారాగణం, సిబ్బంది అపారమైన కృషి అవసరమవుతుంది. అక్టోబర్‌ చివరి వారం నుంచి షెడ్యూల్‌ ప్రకారం రామోజీ ఫిల్మ్‌ సిటీలో వేసిన భారీ సెట్‌లో ‘హరి హర వీరమల్లు’ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. పవన్‌ కల్యాణ్‌తో పాటు 900 మంది నటీనటులు, సిబ్బంది ఈ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ సినిమా ఓ మైలురాయి అవుతుందని, ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు సంబరాలు చేసుకుంటారని మాకు నమ్మకంగా ఉంది. వెండితెరపై అద్భుతాన్ని సృష్టించడానికి మేము చేస్తున్న ఈ గొప్ప ప్రయత్నంలో ముందుకు వెళ్లడానికి మీ అందరి ప్రేమ, మద్దతు మాకు ఇలాగే నిరంతరం అందిస్తారని కోరుకుంటున్నాం’’ అని చిత్రబృందం తెలిపింది . ఇది చూసిన ఫ్యాన్స్‌ అదిరిపోయే అప్‌డేట్‌ అంటూ సోషల్‌మీడియాలో సందడి చేస్తున్నారు. పవన్‌ కల్యాణ్‌ తొలి పాన్‌ ఇండియా చిత్రమైన ఈ సినిమాలో ఆయన సరసన నిధి అగర్వాల్‌ నటిస్తోంది. ఎ.దయాకర్‌ రావు నిర్మాత కాగా ఎం.ఎం.కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. 


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని