దసరాకు మీడియా అకాడమీ భవన ప్రారంభోత్సవం

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ మీడియా అకాడమీ భవన నిర్మాణాన్ని సెప్టెంబరులోగా పూర్తి చేయాలని ఛైర్మన్‌ అల్లం నారాయణ అధికారులను ఆదేశించారు. రూ.15 కోట్లతో చేపట్టిన భవన నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయని.. దసరాకు సచివాలయం, అమరవీరుల స్తూపంతో పాటు మీడియా అకాడమీ భవనాన్ని కూడా సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభించేందుకు సంకల్పించామన్నారు. మంగళవారం ఆయన నాంపల్లిలో నూతన భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పనులను ముమ్మరం చేయాలని ఆదేశించారు. అకాడమీ భవనంలో ఆడిటోరియం, రెండు తరగతి గదులు, గ్రంథాలయం ఉంటాయన్నారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని