close

తాజా వార్తలు

నాకేం బాధ లేదు: కుల్‌దీప్‌

మైసూర్‌: టీమిండియాకు ఎంపిక చేసిన చివరి రెండు టీ20 సిరీసుల్లో చోటు దక్కనందుకు తానేమీ బాధపడడం లేదని చైనామన్‌ బౌలర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ అన్నాడు. ఐదు రోజులు క్రికెట్‌లో రాణించేందుకు దొరికిన అవకాశంగా దీనిని భావిస్తున్నానని వెల్లడించాడు. వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికా సిరీసులకు ఎంపిక చేయనంత మాత్రాన ఆత్మవిశ్వాసం తగ్గదని పేర్కొన్నాడు.

‘ఇప్పటి వరకైతే పరిమిత ఓవర్ల క్రికెట్లో నా ప్రదర్శన సంతృప్తికరంగా సాగింది. తెలుపు బంతితో నాకు సౌకర్యంగా అనిపిస్తుంది. చివరి టీ20 రెండు సిరీస్‌లకు ఎంపికవ్వనందుకు బాధపడడం లేదు. నాకు విరామం అవసరమని సెలక్టర్లు భావించారేమో. కొన్ని మార్పులు అవసరమని జట్టు ఆలోచనేమో. ఆ నిర్ణయాలను నేను గౌరవిస్తా. నాకేమీ ఫిర్యాదులు లేవు. టెస్టుల్లో రాణించేందుకు ఇదో మంచి అవకాశంగా భావిస్తాను. ప్రస్తుతం మణికట్టు స్పిన్నర్లు అంతర్జాతీయ క్రికెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్నారన్న దాంట్లో సందేహం లేదు’ అని కుల్‌దీప్‌ అన్నాడు.

‘కొన్నిసార్లు పరుగులు నియంత్రించేందుకు ప్రయత్నిస్తే ఎక్కువ ఇవ్వాల్సి రావొచ్చు. మన కచ్చితత్వం కోసం పనిచేయాలి. ఎకానమీ కోసం ప్రయత్నించాలి. నిలకడగా ఆడకుంటే ఎరుపు బంతి క్రికెట్లో లయ దొరకడం కష్టం. వికెట్లు తీసేందుకు, ఫీల్డర్లను మోహరించేందుకు సుదీర్ఘ స్పెల్స్‌ వేయాలి. సన్నాహక మ్యాచ్‌లు ఆడాలి. జట్టులో అశ్విన్‌, జడ్డూ, నేను ఉన్నప్పుడు కూర్పు సవాల్‌గా ఉంటుంది. దొరికిన కొన్ని అవకాశాల్లోనే రాణించాలంటే ఒత్తిడి ఎదుర్కోక తప్పదు’ అని కుల్‌దీప్‌ అభిప్రాయపడ్డాడు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు