close

ఫీచర్ పేజీలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నాతో నేను విహరించాలి

జరసోచో!

‘జిందగీ ఇంతేనా? బోరింగ్‌..!! ఓ రెండు రోజులు అన్నింటికీ దూరంగా ఎటైనా వెళ్లిపోవాలి.. నాతో నేను.. నా కోసం నేను! ఆ ప్రయాణంలో నన్ను నేను కొత్తగా చూసుకోవాలి..’అనుకుంటున్నారు నేటి తరం. దానికో పేరు కూడా పెట్టేశారు... ‘ట్రాన్స్‌ఫర్మెషనల్‌ ట్రావెల్‌’ (టీటీ) అని. మీరూ ఇలానే ఆలోచిస్తున్నారా? అయితే, మేక్‌ మై ట్రిప్‌లు.. వేలకు వేలు డబ్బులు.. టిక్కెట్లు.. రూమ్‌లు.. బ్యాగులకొద్దీ లగేజీలు అక్కర్లేదు. ఎందుకంటే.. మీరు కోరుకునేది విశ్రాంతి, విలాసం కాదు. మార్పు.. మిమ్మల్ని మీరు కొత్తగా ఆవిష్కరించుకునేందుకు చేసే ప్రయత్నం... మరైతే, మీరు ప్లాన్‌ చేసే ‘టీటీ’కి ఏం కావాలి? ఎక్కడికి వెళ్లాలి?
దూరపు కొండలు వద్దు..
టూర్‌ అనగానే దూరపు కొండలు నునుపు అనే రోజులు పోయాయి. మిలీనియల్స్‌ రూటు మార్చేస్తున్నారు. టీటీకి వెళ్దాం అనే ఆలోచన వస్తే.. సుదూరాలవైపు చూడకుండా కనుచూపు మేరలోనే ప్లాన్‌ చేస్తున్నారు. సైకిల్‌ పై లేదంటే నడిచెళ్లి సమయాన్ని గడిపేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రయాణంలో  ప్రదేశాల్ని చూస్తూ పరవశించడం కంటే.. తమని తాము కొత్తగా ఆవిష్కరించుకోవడంలోనే ఎక్కువగా రీఫ్రెష్‌ అవుతున్నారు. ఎక్కడికైనా కొత్త ప్రాంతానికి వెళ్లొస్తే చాలు. మూడ్‌ ఆటోమేటిక్‌గా మారిపోతుందిలే అనుకుని వెళ్లేకంటే. ముందే మానసికంగా మార్పుని కోరుకుంటూ టీటీని ప్లాన్‌ చేస్తే మంచి ఫలితాల్ని సాధించొచ్చని మిలీనియల్స్‌ బలంగా నమ్ముతున్నారు.

‘టీటీ’ కోసం టిప్స్‌
* మనసుని అడగండి... ఎందుకని?
ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నప్పుడు.. ఎక్కడికి వెళ్లాలి? ఎందుకు వెళ్లాలి? మిమ్మల్ని మీరు కొత్తగా ఆవిష్కరించుకునేందుకు మీరు వెళ్లే ప్రాంతం ఏ మేరకు తగినది? అని ముందే విశ్లేషించుకుని ప్లాన్‌ చేయండి.
* రాకపోకలు ఎలా?
ఏదో ఒక ట్రాన్స్‌పోర్టులో వెళ్లామా? వచ్చామా? అనేట్టుగా కాదు. వెళ్లే దారంతా ఎన్నో జ్ఞాపకాలు మిగుల్చుకునేలా.. శారీరకంగా కాస్తైనా అలసి సేదతీరేలా ట్రావెల్‌ చేయాలి.
* ‘లోకల్‌’ అనిపించుకోండి..
వెళ్లాలనుకునే చోటులో మీరు మమేకం అయిపోవాలి. అక్కడి ప్రాంతీయ భాషపై కాస్తైనా పట్టుంటే.. వారితో హాయిగా సంభాషించొచ్చు. కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. మీరూ లోకల్‌ అనిపించుకుంటేనే కాంక్రీట్‌ జంగిల్‌ జీవితాన్ని కాసేపైనా మర్చిపోవడం సాధ్యం అవుతుంది.

లెక్కలేసుకోవద్దు..
రోజువారీ లైఫ్‌ స్టైల్‌.. నెల వారీ బడ్జెట్‌లకు భిన్నంగా ప్లాన్‌ చేయాలి. అప్పుడే మీరు కోరుకునే కిక్కు దొరుకుతుంది. మిమ్మల్ని మీరు డిస్కవరీ చేసుకోవడం సాధ్యం అవుతుంది. ‘మీరెళ్లే దారులు.. ఎదురయ్యే మనుషులు.. వారి మాటలు.. అలవాట్లు.. సాంప్రదాయాలు.. సంఘటనలు.. రోజువారీ లైఫ్‌ స్టైల్‌కి భిన్నంగా ఉంటాయి. వాటికి కనెక్టు అయితేనే మీలోని మరో కోణం బయటపడుతుంది అంటున్నాడు మిలీనియల్‌ ట్రావెలర్‌ రవి. ‘నా సైకిల్‌ వెనకే పరిగెడుతూ.. నాకు టాటా చెబుతూ.. వారిదైన శైలిలో స్పందించే పిల్లలు, వారి నవ్వుల్ని  చూసినప్పుడు నాలో ఏదో తెలియని ఆనందం. కొన్ని నిమిషాల పాటు ఆ పిల్లల మధ్య నేనూ ఓ కిడ్‌లా మారిపోతా. నా ప్రొఫెషన్‌, బరువులు, బాధ్యతలు ఏవీ నన్ను ఆపలేవు. ఇదే నేను కోరుకున్న మార్పు’ అని ఓ టీటీ జర్నీని పంచుకున్నాడు.


మీదైన ట్రావెల్‌ ప్యాకెజీ..

ఫ్రెండ్స్‌తో ఏదైనా టూర్‌ ప్లాన్‌ చేస్తే.. ఏయే ట్రావెల్‌ ప్యాకేజీలు ఉన్నాయో చెక్‌ చేస్తాం. బడ్జెట్‌ ఎంతో చూసుకుని ఓకే చేసేస్తాం. రెండు, మూడు రోజుల అల్లరి.. హల్‌ చల్‌ చేస్తాం. తిరిగి వచ్చాక ఎవరి పనుల్లో వాళ్లు. ఆ తరహా ట్రిప్‌లకు అతీతంగా ప్లాన్‌ చేస్తున్నారు టీటీ ట్రావెలింగ్‌ని. ప్రయాణంలో లైఫ్‌ని వెతుక్కుంటున్నారు. ఆగి గడిపే ప్రతి గమ్యంలోనూ తమని తాము స్వీయ సమీక్ష చేసుకుంటున్నారు. ఒత్తిడి, ఆలోచనల్ని అదుపు చేసుకుంటూ వారికేం కావాలో.. ఏం కోల్పోతున్నారో.. తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ‘గ్యాడ్జెట్‌లు, బ్యాక్‌ప్యాక్‌లు ఏవీ ఉండవు. ఆగాలి అనిపించిన చోటల్లా ఆగుతా. ప్రకృతితో మమేకం అవుతా. ప్రశాంతంగా అనిపించిన చోట కాసేపు ధ్యానం. ప్రయాణంలో ఎదురయ్యే అందరితో కలిసిపోవడం.. దొరికింది తినడం.. ఏ చెట్టు నీడనో నిద్రించడం.. ఆస్వాదించాకే తెలిసింది.. నేను తొక్కి వచ్చిన సైకిల్‌ జాడల్లో నిజమైన జీవితం ఉంది’ అని చెబుతోంది డాక్టర్‌ కనీజ్‌.


 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు