close

తాజా వార్తలు

ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక బస్సులు

హైదరాబాద్‌: నగరంలోని ప్రభుత్వ ఉద్యోగుల కోసం రేపటినుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు వారి ఇళ్ల నుంచి కార్యాలయాలకు వెళ్లేందుకు వీలుగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు రవీందర్‌ రెడ్డి చెప్పారు. ఉద్యోగులకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసేందుకు అనుమతించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. నగరంలోని వివిధ చోట్ల నుంచి కార్యాలయాలకు వచ్చే వారికి ఈ సౌకర్యం కల్పించినట్లు వివరించారు. ఉద్యోగులు తప్పనిసరిగా వారి గుర్తింపు కార్డు చూపిస్తేనే బస్సులోకి అనుమతిస్తారని స్పష్టం చేశారు. నగరంలోని 32 మార్గాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు బస్సు సౌకర్యాన్ని కల్పించినట్లు రవీందర్‌ రెడ్డి వివరించారు.
 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు