close

తాజా వార్తలు

డ్రెస్సు కొనుక్కుందని అక్క కళ్లు పీకేసి..

దిల్లీ: కొత్త డ్రెస్సు కొనుక్కుందనే కోపంతో ఓ తమ్ముడు అక్కపై దాడి చేసి తీవ్రంగా గాయపరచడంతో పాటు గదిలో పెట్టి బంధించాడు. అమానవీయమైన ఈ ఘటన దిల్లీలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. బిహార్‌కు చెందిన బాధిత యువతి(20).. తన తమ్ముడు(17), చెల్లెళ్లతో కలిసి దిల్లీలోని ద్వారక సమీపంలో నివసిస్తోంది. 

తనకు తెలియకుండా అక్క రూ.100 విలువైన కొత్త డ్రెస్సు కొనుక్కుందన్న కోపంతో తమ్ముడు ఆమెపై దాడి చేసి కనుగుడ్లను చేతి వేళ్లతో పీకేసేందుకు ప్రయత్నించాడు. తీవ్రంగా గాయపడ్డ ఆమెను గదిలో బంధించి తాళం వేశాడు. దిల్లీ మహిళా కమిషన్‌ సభ్యులు మంగళవారం నగరంలో పర్యటిస్తున్న సమయంలో స్థానికులు ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకొచ్చారు. 

ఆ యువతి దగ్గరికి వెళ్లేందుకు ప్రయత్నించిన అధికారులతో సైతం బాలుడు గొడవకు దిగాడు. తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించిన అధికారులకు యువతి తీవ్రగాయాలు, రక్తస్రావంతో నేలపై పడుండటం కనిపించింది. అధికారులు వెంటెనే యువతిని చికిత్స నిమిత్తం సఫ్దర్‌గంజ్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. యువతి తల్లిదండ్రులకు విషయం తెలియజేశామని దిల్లీ మహిళా కమిషనర్‌ స్వాతి మలివాల్‌ చెప్పారు. ఆ బాలుడిపై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు నోటీసులు పంపామని ఆమె పేర్కొన్నారు. గతంలో కూడా చాలా సార్లు ఈ బాలుడు తన అక్కాచెల్లెళ్లపై దాడి చేసి వేధించినట్లు స్థానికులు చెప్పారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు