close

ఫీచర్ పేజీలు

ముందు నుంచే ముందడుగు!

కార్ఖానా, న్యూస్‌టుడే: అనుమానాస్పద స్థితిలో గృహిణి ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన తిరుమలగిరి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం జరిగింది. సీఐ రవికుమార్‌ కథనం ప్రకారం..సరస్వతీనగర్‌ ప్రాంతానికి చెందిన టి.వెంకటేష్‌, నాగలక్ష్మి(30) దంపతులు. వీరికి ముగ్గురు సంతానం. వెంకటేష్‌ మిల్లర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం అతను మిల్లర్‌ వాహనాన్ని కొనుగోలు చేశాడు. ఈ క్రమంలో 26న నాగలక్ష్మి తండ్రి బక్కయ్య వీరి ఇంటికి వచ్చాడు. పనికి సంబంధించి అల్లుడు, మామ బయటకు వెళ్లారు.  మధ్యాహ్నం భోజనం చేసేందుకు ఇంటికి వచ్చారు. లోపలి నుంచి గడియ పెట్టి ఉండడంతో పలుమార్లు తలుపు తట్టినా ఎలాంటి స్పందన రాలేదు. అనుమానం వచ్చిన వెంకటేష్‌ కిటిలో నుంచి చూడగా నాగలక్ష్మి ఫ్యాన్‌కు ఉరేసుకొని కనిపించింది. దీంతో చుట్టుపక్కల వారి సహాయంతో తలుపులు పగులగొట్టగా కొనఊపిరితో తండ్రి చేతుల్లో మరణించింది. సమాచారం అందుకున్న తిరుమలగిరి పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల తన అల్లుడు మిల్లర్‌ వాహనాన్ని కొనుగోలు చేయడంతో ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయని, బహుశా ఇదే కారణంతో తన కుమార్తె ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని బక్కయ్య పోలీసులకు ఫిర్యాదులో తెలిపినట్లు సీఐ తెలిపారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు