close

తాజా వార్తలు

దేశ ప్రజలచూపు మోదీ వైపే: రాజగోపాల్‌రెడ్డి

తిరుమల: మోదీ, అమిత్‌షా నేతృత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి పునరుద్ఘాటించారు. తన కుటుంబ సభ్యులతో కలిసి ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. దేశ ప్రజలంతా మోదీ వైపు చూస్తున్నారన్నారు. ఇదే మాటను తాను గతంలోనూ చెప్పినట్టు ఆయన గుర్తు చేశారు. పార్టీ మార్పుపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఏపీ సీఎం జగన్‌ నెరవేరుస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు.మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు