close

క్రైమ్

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
లంచగొండి తహసీల్దార్‌ సస్పెన్షన్‌

ఉత్తర్వులు జారీ - ఏసీబీ అధికారుల విచారణ

ఈనాడు డిజిటల్‌, ఆసిఫాబాద్‌:  భూ సమస్యల పరిష్కారం కోసం రైతుల నుంచి రూ.10 లక్షల వరకు వసూలు చేసి, తిరిగి ఇచ్చేస్తానని రాసి ఇచ్చిన కుమురం భీం జిల్లా చింతలమానెపల్లి తహసీల్దార్‌ ఖాజా నియాజుద్దీన్‌పై కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా సస్పెన్షన్‌ వేటు వేశారు. ఈ మేరకు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఏసీబీ అధికారులు సైతం సదరు లంచగొండి తహసీల్దార్‌పై విచారణ చేపట్టారు. ఖాజా నియాజుద్దీన్‌పై వచ్చిన అవినితి ఆరోపణల నేపథ్యంలో అనిశా డీఎస్పీ భద్రయ్య, సీఐలు వేణు, ప్రశాంత్‌ శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి తహసీల్దార్‌ కార్యాలయంలోనే విచారణ చేపట్టారు. తహసీల్దార్‌కు డబ్బులిచ్చిన 16 మంది రైతులను కార్యాలయానికి పిలిచి అనిశా అధికారులు మాట్లాడారు. ఎవరెవరు ఎందుకు, ఎంత మొత్తంలో డబ్బులు ఇచ్చారో.. అనే వివరాలను నమోదు చేసుకున్నారు. మరో రెండు రోజల పాటు విచారణ కొనసాగుతుందని, అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని అనిశా డీఎస్పీ భద్రయ్య పేర్కొన్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు