ఆధార్‌తో పాన్‌ను జత చేశారా?
close

Updated : 19/03/2021 10:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆధార్‌తో పాన్‌ను జత చేశారా?

మీ శాశ్వత ఖాతా సంఖ్య (పాన్‌)ను... మీ ఆధార్‌తో అనుసంధానం చేశారా? ఇప్పటికీ చేయకపోతే వెంటనే త్వరపడండి. మార్చి 31 లోగా ఈ పని పూర్తి చేయకపోతే రూ.10వేల జరిమానా చెల్లించాల్సి రావచ్చు.
ఆధార్‌తో పాన్‌ను అనుసంధానించుకోవాల్సిందిగా సూచిస్తూ.. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) గత ఏడాది ఫిబ్రవరి 13న నోటిఫికేషన్‌ను జారీ చేసింది. దీనికి చివరి తేదీగా మార్చి 31, 2021ని నిర్ణయించింది. ఆలోపు మీరు ఈ రెండింటినీ అనుసంధానించకపోతే.. ఏప్రిల్‌ 1, 2021 నుంచి పాన్‌ చెల్లకుండా పోతుంది. దీంతోపాటు.. ఆ పాన్‌ ఉన్న వ్యక్తి దగ్గర్నుంచి రూ.10వేల వరకూ జరిమానాను విధించే ఆస్కారమూ  ఉంది.
పాన్‌ కార్డులు చాలా ఆర్థిక లావాదేవీల్లో కీలకం. బ్యాంకు ఖాతా ప్రారంభించేందుకు, మ్యూచువల్‌ ఫండ్లు, షేర్లలో మదుపు చేయాలన్నా.. రూ.50,000 మించి నగదు లావాదేవీల సమయంలోనూ పాన్‌ తప్పనిసరి అవసరం. పాన్‌ చెల్లుబాటులో లేకపోతే.. ఇవన్నీ చేయడం సాధ్యం కాదు. ఇదే కాదు.. ఆస్తుల క్రయవిక్రయాలకూ ఇబ్బంది తలెత్తుతుంది. జరిమానా చెల్లించి, పాన్‌తో ఆధార్‌ను అనుసంధానం చేసుకున్నప్పుడే మళ్లీ వీటిని అనుమతిస్తారు.

* పాన్‌, ఆధార్‌లను జత చేయడం ఎంతో తేలిక. ఇన్‌కంట్యాక్స్‌ఇఫైలింగ్‌ వెబ్‌సైటులోకి వెళ్లి.. ఈ పనిని పూర్తి చేయొచ్చు.
* మొబైల్‌ నుంచి సంక్షిప్తం సందేశం పంపించడం ద్వారానూ దీన్ని పూర్తి చేయొచ్చు. ఆధార్‌తో అనుసంధానం అయిన మొబైల్‌ నెంబరు నుంచి UIDAIPAN అని టైప్‌ చేసి 12 అంకెల ఆధార్‌ నెంబరు, స్పేస్‌ ఇచ్చి, పాన్‌ నెంబరును.. 567678 లేదా 56161 అనే నెంబర్లకు సందేశం పంపించాలి.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే..  ఆధార్‌, పాన్‌ వివరాలన్నీ ఒకే విధంగా ఉండాలి. ఉదాహరణకు పాన్‌, ఆధార్‌లో పుట్టిన తేదీ వేర్వేరుగా ఉంటే.. అనుసంధానం కుదరకపోవచ్చు. పేరులో తప్పులున్నా సాధ్యం కాదు.

* ఇప్పటికే మీరు ఈ రెండింటినీ జత చేసుకున్నా.. మరోసారి ఇఫైలింగ్‌ వెబ్‌సైటులోకి వెళ్లి, చూసుకోవడం మంచిది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని