యాక్సిస్‌ బ్యాంకు లాభాలు రూ.2,677 కోట్లు - Axis Bank Q4 Results Released
close

Published : 27/04/2021 18:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యాక్సిస్‌ బ్యాంకు లాభాలు రూ.2,677 కోట్లు

నాలుగో త్రైమాసికం ఫలితాలు వెల్లడి

ముంబయి: అతి పెద్ద ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటయిన యాక్సిస్ బ్యాంక్ 2020-21 ఆర్థిక సంవత్సరంలో మార్చితో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం రూ.2,677 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో బ్యాంకు రూ.1,388 నికర నష్టాల్ని చవిచూసింది. బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం ఈసారి 11 శాతం పెరిగి రూ.7,555 కోట్లకు చేరుకుంది. అంకుముందు ఏడాది ఇది రూ.6,808 కోట్లుగా ఉంది.

రుణాలు ఏడాది ప్రాతిపదికన 12 శాతం పెరిగినట్లు సంస్థ వెల్లడించింది. మూడో త్రైమాసికంతో పోలిస్తే రుణాలు 8 శాతం వృద్ధి చెందాయి. ఇక, బ్యాంక్ కేటాయింపులు 58 శాతం తగ్గి రూ.3,295 కోట్లకు చేరుకున్నాయి. కాగా, చివరి త్రైమాసికంలో స్థూల నిరర్ధక ఆస్తులు(ఎన్‌పీఏ) 5.25 శాతంగా, నికర ఎన్‌పీఏలు 1.05 శాతంగా ఉన్నాయి. గతంతో పోలిస్తే నిరర్ధక ఆస్తులు తగ్గడం విశేషం.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని