భారత్‌ బయోటెక్‌తో బ్రెజిల్‌ ఒప్పందం! - Brazil signs vaccine deal with Indian company
close

Updated : 26/02/2021 12:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత్‌ బయోటెక్‌తో బ్రెజిల్‌ ఒప్పందం!

సావో పాలో(బ్రెజిల్‌) : దేశీయ ప్రముఖ ఔషధ తయారీ సంస్థ భారత్‌ బయోటెక్‌తో బ్రెజిల్‌ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. 20 మిలియన్‌ డోసుల కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ కోసం ఆ దేశ ఆరోగ్య శాఖ భారత కంపెనీతో కొనుగోలు ఒప్పందం చేసుకుంది. అయితే, దీన్ని ఇంకా స్థానిక అధికార యంత్రాంగాలు ధ్రువీకరించాల్సి ఉంది. 20 మిలియన్‌ డోసుల్లో తొలి 8 మిలియన్లు బ్రెజిల్‌లోని ప్రెసిసా మెడికామెంటోస్‌లోనే ఉత్పత్తి అవుతాయని.. అవి మార్చి నాటికి అందుతాయని ఆ దేశ అధ్యక్షుడు బోల్సోనారో అధికార యంత్రాంగం వెల్లడించింది. మిగిలిన 8 మిలియన్ల డోసులు ఏప్రిల్‌లో, తదుపరి నాలుగు మిలియన్ల డోసులు మే నాటికి అందుబాటులోకి వస్తాయని పేర్కొంది.

బ్రెజిల్‌లో ఇప్పటి వరకు 1,03,90,461 మంది కరోనా బారినపడ్డారు. వీరిలో 2,51,498 మంది మృత్యువాతపడ్డారు. కేసులపరంగా బ్రెజిల్‌ ప్రపంచంలో మూడో స్థానంలో ఉండగా.. మరణాల్లో రెండో స్థానంలో ఉంది. ఆ దేశ జనాభా 21 కోట్ల కాగా.. ఇప్పటి వరకు దాదాపు నాలుగు శాతం మందికి టీకా అందింది. అయితే, ప్రెసిసాగానీ, భారత్‌ బయోటెక్‌గానీ తమ మధ్య ఒప్పందం కుదిరినట్లు ప్రకటించకపోవడం గమనార్హం.

ఇవీ చదవండి...

ఆర్థిక లక్ష్యం చేరాలంటే...

పెట్రోపై పన్నులు క్రమేణ తగ్గించాలిమరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని