stock market: ఊగిసలాటలో సూచీలు...! - Indices open flat
close

Published : 27/05/2021 09:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

stock market: ఊగిసలాటలో సూచీలు...!

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. ఉదయం 9.21 సమయంలో సెన్సెక్స్‌ 44 పాయింట్ల నష్టంతో 50,973 వద్ద, నిఫ్టీ  1 పాయింటు నష్టంతో 15,299 వద్ద ట్రేడవుతున్నాయి. ఉదయం స్వల్ప లాభాల్లో మొదలైన సూచీలు ఆ తర్వాత నష్టాల్లోకి జారుకొన్నాయి. రూప అండ్‌ కంపెనీ, తిరుమలై కెమికల్స్, హికాల్‌ లిమిటెడ్‌, బిర్లా సాఫ్ట్‌ కంపెనీల షేర్లు లాభాల్లో ఉండగా.. కర్నాటక బ్యాంక్‌, ఎఫ్‌డీసీ లిమిటెడ్‌, డిష్‌ టీవీ ఇండియా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అన్ని రంగాలకు చెందిన సూచీలు లాభాల్లోనే కొనసాగుతుండటం విశేషం. 

నేడు మొత్తం 93 కంపెనీలు ఫలితాలను ప్రకటించనున్నాయి. వీటిల్లో ఐషర్‌ మోటార్స్‌, సన్‌ఫార్మా, కాడిల్లా హెల్త్‌కేర్‌, ఐఆర్‌బీ ఇన్ఫ్రా, 63 మూన్‌ టెక్నాలజీస్‌, బోరోసిల్‌, డైయాక్సిన్‌ టెక్నాలజీస్‌, పేజ్‌ ఇండస్ట్రీస్ వంటి కీలక కంపెనీలు ఉన్నాయి. బాండ్‌ ఈల్డ్‌ సమస్యలను పరిష్కరిస్తామని అమెరికా ఫెడరల్‌ రిజర్వు ప్రకటించడంతో నిన్న అక్కడి సూచీలు లాభాల బాటపట్టాయి. డోజోన్స్‌ 0.1శాతం, ఎస్‌అండ్‌పీ500 0.19శాతం, నాస్‌డాక్‌ 0.59శాతం లాభపడ్డాయి. 

 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని