DHFL: పిరమాల్‌ ప్లాన్‌కు ఎన్‌సీఎల్‌టీ ఓకే..! - NCLT approves Piramal Groups resolution plan for bankrupt financier DHFL
close

Published : 07/06/2021 22:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

DHFL: పిరమాల్‌ ప్లాన్‌కు ఎన్‌సీఎల్‌టీ ఓకే..!

ఇంటర్నెట్‌డెస్క్‌: ఎన్సీఎల్‌టీ ముంబయి బెంచ్‌ దేవాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ (డీహెచ్‌ఎఫ్‌ఎల్‌) కేసులో కీలక తీర్పును వెలువరించింది. ఇప్పటికే పిరమాల్‌ గ్రూప్‌ ఇచ్చిన రిసొల్యూషన్‌ ప్లాన్‌కు ఎన్‌సీఎల్‌టీ పచ్చజెండా ఊపింది. ఎన్‌సీఎల్‌ఏటీ, సుప్రీంకోర్టుల్లో వచ్చే తీర్పులపై దీని అమలు  ఆధారపడి ఉంటుంది. పిరమాల్‌ రూ.37,250 కోట్లు విలువైన పరిష్కార ప్రణాళకను సూచించింది. ఇప్పటికే ఈ ప్రణాళికను కమిటీ ఆఫ్‌ క్రెడిటార్స్‌, ఆర్బీఐ, కాంపిటేషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియాలు ఆమోదించాయి. 

ఈ సందర్భంగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌దార్లకు, చిన్నమొత్తాలు ఇన్వెస్ట్‌ చేసిన వారికి ఎక్కువ మొత్తం వచ్చేట్లు చూడాలని ఎన్‌సీఎల్‌టీ కమిటీ ఆఫ్ క్రెడిటార్స్‌కు సూచించింది. ఈ అంశంలో తుది నిర్ణయం కమిటీ ఆఫ్ క్రెడిటార్స్‌దే అని పేర్కొంది. ‘‘ఈ రోజు ఎన్‌సీఎల్‌టీలో తీర్పు అనుకూలంగా వచ్చింది. మా పరిష్కార ప్రణాళికను ఎన్‌సీఎల్‌టీ అంగీకరించింది. దీనిని 94శాతం మంది రుణదాతలు కూడాఅంగీకరించారు. అనంతరం ఆర్‌బీఐ, సీసీఐ అనుమతులు కూడా లభించాయి. ఇవన్నీ మా బిడ్‌ ఎంత సమంజసమైందో చెబుతున్నాయి’’ అని పిరమాల్‌ సంస్థ పేర్కొంది. 


డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ మాజీ ప్రమోటర్‌ కపిల్‌ వాద్వాన్‌  ఇటీవలే ఎన్సీఎల్‌ఏటీ ఆదేశాలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే దిగువన ఉన్న ఎన్సీఎల్టీలో ఆయన ఆఫర్‌ను బ్యాంకులు పరిశీలించాలని తీర్పురాగా.. దానిపై అప్పిలేట్‌ ట్రైబ్యూన్‌ల్‌ అయిన ఎన్సీఎల్‌ఏటీ స్టే విధించింది. 

తొలుత ఎన్సీఎల్టీ రుణతీర్పులు దాతలు, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌కు ఆర్‌బీఐ నియమించిన అడ్మిస్ట్రేటర్లు ఎన్‌సీఎల్‌ఏటీని ఆశ్రయించారు. ఈ తీర్పును పరిశీలించిన ఎన్సీఎల్‌ఏటీ స్టే విధించింది. ఇటువంటి తీర్పులు ఇవ్వడానికి ఎటువంటి చట్టం లేదని పేర్కొంది. కమిటీ ఆఫ్‌ క్రెడిటార్స్‌ను వాద్వాన్‌ ఆఫర్‌ను పరిశీలించాలని సూచించలేరని వెల్లడించింది. 

డిసెంబర్‌లో వాద్వాన్‌ ఆర్‌బీఐ నియమించిన అడ్మిస్ట్రేటర్లకు ఒక లేఖ రాశారు. దీనిలో ఆయన రుణదాతల నుంచి తీసుకొన్న రూ.91,158 కోట్లను చెల్లించేందుకు అంగీకరించారు. దీనిలో రూ.9 వేల కోట్లను తొలుత చెల్లించగా.. మిగిలినది వచ్చే 7 నుంచి 8 ఏళ్లలో రుణాలను వాటాలుగా మార్చే విధానం కింద చెల్లిస్తానని తెలిపారు. దీనికి సంబంధించే ఎన్సీఎల్టీ నుంచి కేసు ఎన్సీఎల్‌ఏటీకి వచ్చింది. ఇక్కడ గత తీర్పుపై స్టే విధించడంతో వాద్వాన్‌ స్పందించేందుకు జూన్‌ 25 వరకు సమయం ఇచ్చారు. కానీ, ఆయన అంతకు ముందే నేరుగా సుప్రీంను ఆశ్రయించారు. ఇప్పుడు ఆ తీర్పుపై ఎన్సీఎల్టీ తీర్పు ఆధారపడి ఉంటుంది. 

 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని