పిల్ల‌ల పేరుతో పీపీఎఫ్ ఖాతా తెరిచే ముందు తెలుసుకోవాల్సిన అంశాలు - PPF-account-in-name-of-minor-child-10-things-you-should-know
close

Published : 12/05/2021 15:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పిల్ల‌ల పేరుతో పీపీఎఫ్ ఖాతా తెరిచే ముందు తెలుసుకోవాల్సిన అంశాలు

పీపీఎఫ్ లేదా ప‌బ్లిక్ ప్రావిడెండ్ ఫండ్, ప‌న్ను ప్ర‌యోజ‌నాల‌ను అందించే చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాల‌లో ఎంతో ప్రాథాన్య‌త పొందింది. ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 80సీ కింద మిన‌హాయింపు అందిస్తుంది. దీర్ఘ‌కాలం పాటు పొదుపు చేయాల‌నుకునే వారికి మంచి ఎంపిక‌. వ‌డ్డీఆదాయం, మెచ్యూరిటీ మొత్తాల‌పై రెండింటికి ప‌న్ను వ‌ర్తించ‌దు. ఒక వ్య‌క్తి వారి పిల్ల‌ల పేర్ల‌పై, మైన‌ర్ సంర‌క్ష‌కుని(గార్డియ‌న్‌)గా పీపీఎఫ్ ఖాతాను తెరువ‌వ‌చ్చు. అయితే జాయింటుగా ఖాతాను తెర‌వ‌టం సాధ్యంకాదు. మైన‌ర్ 18 సంవ‌త్స‌రాలు నిండిన త‌రువాత, అత‌ను/ ఆమె ఖాతాను స్వ‌యంగా నిర్వ‌హించుకోవ‌చ్చు. మైన‌ర్ ఖాతాల‌పై రుణాలు, పాక్షిక విత్‌డ్రా వంటివి కూడా అనుమ‌తిస్తారు.

మైన‌ర్ పేరుపై ఉన్న పీపీఎఫ్ ఖాతా గురించి తెలుసుకోవాల్సిన 10 ముఖ్య విష‌యాలు:

1. ఒక వ్య‌క్తి త‌న పేరుపై గానీ, మైన‌ర్ త‌రపున సంర‌క్ష‌కునిగా గానీ పీపీఎఫ్ ఖాతాను తెరువ‌వ‌చ్చు. రూ.100తో ఖాతాను తెరించేందుకు వీలుంది. ఒక సంవ‌త్స‌రంలో డిపాజిట్ చేయ‌వ‌ల‌సిన క‌నీస మొత్తం రూ.500, గ‌రిష్టంగా, వార్షికంగా రూ.1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు జ‌మ‌చేయ‌వ‌చ్చు.
2. త‌ల్లి/తండ్రి /గార్డియ‌న్ వారి పేరుపై ఇదివ‌ర‌కే పీపీఎఫ్ ఖాతా ఉంటే, పిల్ల‌ల పేరుతో తెరిచే ఖాతా, మునిపిటి ఖాతాలో క‌లిపి ఒక సంవ‌త్స‌రానికి గ‌రిష్టంగా రూ.1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు మాత్ర‌మే జ‌మ‌చేసేందుకు వీలుంటుంది.
3. త‌ల్లి/తండ్రి/గార్డియ‌న్ వారి ఆదాయం నుంచి మైన‌ర్ పేరుపై ఉన్న పీపీఎఫ్ ఖాతాలో పెట్టుబ‌డి పెడితే సెక్ష‌న్ 80 సీ ప్ర‌కారం ఆదాయ‌పు ప‌న్ను మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు.
4. మైన‌ర్‌కు 18 సంవ‌త్స‌రాలు నిండిన అనంత‌రం మైన‌ర్ నుంచి మేజ‌ర్‌కు స్టేట‌స్ మార్చేందుకు దర‌ఖాస్తు చేసుకోవాలి. అప్పుడు మాత్ర‌మే వారు స్వ‌యంగా వారి ఖాతాను నిర్వ‌హించేందుకు వీలుంటుంది.
5. అవ‌స‌ర‌మైన ప‌త్రాల‌తో పాటు డిపాజిట‌ర్ సవ‌రించిన ద‌ర‌ఖాస్తును ఇవ్వాలి. ఈ ద‌ర‌ఖాస్తు ఫార‌మ్‌లో మేజ‌ర్ అయిన డిపాజిట‌ర్ సంత‌కం, ఖాతా తెరిచిన సంర‌క్ష‌కుడు ధృవీక‌రించాలి.
6. డిపాజిట‌ర్ పీపీఎఫ్ ఖాతా ప్రారంభించిన నాటి నుంచి 7వ సంవ‌త్స‌రంలో పాక్షిక విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. ఒక‌వేళ మైన‌ర్ ఖాతా నుంచి పాక్షిక విత్‌డ్రా చేయాలంటే, ఆ మొత్తాన్ని మైన‌ర్ కోసం వినియోగిస్తున్న‌ట్లుగా సంర‌క్ష‌కుడు డిక్ల‌రేష‌న్ ఇవ్వాలి.
7. కొన్ని నిర్ధిష్ట సంద‌ర్భాల‌లో డిపాజిట‌ర్ సంర‌క్ష‌కునిగా వ్య‌వ‌హ‌రించే పీపీఎఫ్ ఖాతాను మూసివేసేందుకు ప్ర‌య‌త్నించ‌వ‌చ్చు.
8. ఖాతాదారుని వైద్య చికిత్స‌ల కోసం, ఖాతా ప్రారంభించిన నాటి నుంచి ఐదేళ్ళు పూర్తైన త‌రువాత‌ పీపీఎఫ్ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునే అవ‌కాశం ఉంది. అయితే ఇందుకు సంబంధించిన వైద్య నివేదిక‌ల‌తో పాటు, నిపుణుడైన వైద్యుని వ‌ద్ద నుంచి లెట‌ర్ తీసుకుని రావాల్సి ఉంటుంది.
9. మైనర్ ఖాతాదారుడి ఉన్నత విద్యకు పీపీఎఫ్‌ మొత్తం అవసరమైతే, ఖాతా ప్రారంభించిన నాటి నుంచి 5 సంవ‌త్స‌రాల త‌రువాత ఖాతాను పూర్తిగా ర‌ద్దు చేసుకునే వీలు క‌ల్పిస్తారు.
10. మైన‌ర్ పీపీఎఫ్ ఖాతాపై గార్డియ‌న్ రుణం తీసుకునే వెసులుబాటు కూడా ఉంది. అయితే రుణం తీసుకున్న మొత్తం మైన‌ర్ సంక్షేమం కోసం మాత్ర‌మే వినియోగిస్తున్న‌ట్లు గార్డియ‌న్ డిక్ల‌రేష‌న్ ఇవ్వాలి.
 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని