stock market: లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. - Sensex gains 298pts in opening trades
close

Updated : 21/10/2021 09:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

stock market: లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు..

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు గురువారం లాభాల్లో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. ఉదయం 9.26 సమయంలో సెన్సెక్స్‌ 155 పాయింట్లు పెరిగి 61,415 వద్ద, నిఫ్టీ 54 పాయింట్లు పెరిగి 18,321 వద్ద కొనసాగుతున్నాయి. అన్ని రంగాల సూచీలు లాభాల్లో ఉన్నాయి. ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా, వార్రోక్‌ ఇంజినీరింగ్‌, షాపర్స్‌ స్టాప్‌, ఐఐఎఫ్‌ఎల్‌, ఇండిగో రెమిడీస్‌ షేర్ల విలువ పెరగ్గా.. హవేల్స్‌ ఇండియా, ఏషియన్‌ గ్రానిటో ఇండియా, శ్రీరాం సిటీ యూనియన్‌, నెల్కో, వోల్టాస్‌ షేర్లు కుంగాయి. 

నేడు ఏషియన్‌ పెయింట్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, కంటైనర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఐడీబీఐ బ్యాంక్‌, ఇండియన్‌ ఎనర్జీ ఎక్స్‌ఛేంజి, ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌, ఇండియన్‌ హోటెల్స్‌, ఇండియా మార్ట్‌ ఇంటర్‌ ఎంఈఎస్‌హెచ్‌, లెమన్‌ ట్రీ హోటల్స్‌, ఎల్‌ఐసీ హౌసింగ్‌ఫైనాన్స్‌, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, టీవీఎస్‌ మోటార్స్‌ కంపెనీ  సహా 49 కంపెనీలు ఫలితాలను ప్రకటించనున్నాయి.

ఆసియాలోని స్టాక్‌ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. జపాన్‌ టాపిక్స్‌ సూచీ 0.3శాతం పతనం కాగా.. ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్‌ 200 సూచీ 0.1శాతం, కొరియా కేవోఎస్‌పీ 0.2శాతం పతనం అయ్యాయి. 


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని