టీకా బాధ్యత కేంద్రానిదే: RBI మాజీ గవర్నర్‌ - centre cant shirk responsibility of universal covid-19 vaccination: c rangarajan
close

Published : 06/05/2021 22:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టీకా బాధ్యత కేంద్రానిదే: RBI మాజీ గవర్నర్‌

హైదరాబాద్‌: దేశం కరోనా మహమ్మారి నుంచి బయటపడాలంటే ప్రజలందరికీ టీకా అందించే బాధ్యతను కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాలని ప్రముఖ ఆర్థిక వేత్త, ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ సి.రంగరాజన్‌ అన్నారు. కేంద్రం తన బాధ్యత నుంచి తప్పుకోవడం ఎంతమాత్రం తగదని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సార్వత్రిక టీకా కార్యక్రమ బాధ్యతను కేంద్రమే తీసుకోవాలని చెప్పారు. ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం, వైద్య సిబ్బందిని నియమించుకోవడం రాష్ట్రాల బాధ్యత అని పేర్కొన్నారు.

కేంద్రమే టీకా బాధ్యత తీసుకుని ఉంటే టీకాకు వేర్వేరు ధరలెందుకన్న ప్రశ్నే ఉత్పన్నం అయ్యి ఉండేది కాదని రంగరాజన్‌ అభిప్రాయపడ్డారు. ఖర్చు ఎంతైనా కేంద్రమే దాన్ని భరించాలని, సార్వత్రిక టీకా బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని చెప్పారు. వ్యాక్సిన్‌ కంపెనీలతో చర్చించి వ్యాక్సిన్‌ కొనుగోలు చేసి పంపిణీ చేయాలని సూచించారు. ఆర్థిక మందగమనం నుంచి బయటపడాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఖర్చును పెంచాలని హితవు పలికారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని