close

Updated : 03/03/2021 10:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రికార్డు స్థాయిలో ఎన్‌ఎండీసీ ఉత్పత్తి, అమ్మకాలు

ఈనాడు, హైదరాబాద్‌: ఇనుప ఖనిజం వెలికి చేసే ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌ఎండీసీ ఈ ఏడాది ఫిబ్రవరిలో రికార్డు స్థాయి ఉత్పత్తి, అమ్మకాలు నమోదు చేసింది. 2020 ఇదే నెలతో పోల్చితే 19 శాతం అధికంగా 38.60 లక్షల టన్నుల ఇనుప ఖనిజాన్ని ఉత్పత్తి చేసింది. అమ్మకాలు 12 శాతం పెరిగి 32.50 లక్షల టన్నులకు చేరాయి. చత్తీస్‌గఢ్‌లోని బైలదిల్లా ప్రాజెక్టు మెరుగైన ఉత్పత్తి, అమ్మకాలు సాధించినట్లు ఎన్‌ఎండీసీ సీఎండీ సుమిత్‌ దేబ్‌ తెలిపారు. మున్ముందు కూడా  అధికంగా ఉత్పత్తి, అమ్మకాలు నమోదు చేయగలమనే విశ్వాసాన్ని వెలిబుచ్చారు. ఎన్‌ఎండీసీ కర్నాటకలోని దోనిమలై గనిలో ఇనుప ఖనిజం తవ్వకాలు ఇటీవల పునఃప్రారంభించింది. ఈ గనిలో నెలకు 5 లక్షల టన్నుల ఇనుప ఖనిజాన్ని ఉత్పత్తి చేయొచ్చు.

 

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని