గ్లెన్‌మార్క్‌ లైఫ్‌ ఐపీఓ నేటి నుంచే
close

Published : 27/07/2021 04:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గ్లెన్‌మార్క్‌ లైఫ్‌ ఐపీఓ నేటి నుంచే

దిల్లీ: గ్లెన్‌మార్క్‌ లైఫ్‌ సైన్సెస్‌ పబ్లిక్‌ ఇష్యూ మంగళవారం (ఈనెల 27) ప్రారంభమై ఈనెల 29న ముగియనుంది. ఇష్యూకు ధరల శ్రేణి రూ.695- 720. దరఖాస్తు చేసుకునే ఒక్కో లాట్‌లో 20 షేర్లుంటాయి. ఇష్యూ ద్వారా రూ.1,514 కోట్లను సమీకరించాలని కంపెనీ అనుకుంటోంది. విక్రయించే షేర్లలో 50 శాతాన్ని క్యూఐబీలకు (అర్హులైన సంస్థాగత కొనుగోలుదార్లు), 15 శాతాన్ని సంస్థాగతతేర మదుపర్లకు, 35 శాతాన్ని చిన్న మదుపర్లకు కేటాయించారు.పబ్లిక్‌ ఇష్యూ ప్రారంభానికి ముందు యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ.454 కోట్లను గ్లెన్‌మార్క్‌ లైఫ్‌ సైన్సెస్‌ సమీకరించింది. మొత్తం 63,06,660 ఈక్విటీ షేర్లను ఒక్కోటి రూ.720 చొప్పున 19 మంది యాంకర్‌ ఇన్వెస్టర్లకు కేటాయించింది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని