ఆగస్టు 4 నుంచి విండ్లాస్‌ ఐపీఓ
close

Updated : 30/07/2021 10:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆగస్టు 4 నుంచి విండ్లాస్‌ ఐపీఓ

ధరల శ్రేణి రూ.448- 460

దిల్లీ: ఫార్మాస్యూటికల్‌ ఫార్ములేషన్ల సంస్థ విండ్లాస్‌ బయోటెక్‌ తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) ద్వారా విక్రయించనున్న షేర్లకు ధరల శ్రేణిగా రూ.448- 460ను నిర్ణయించింది. ఈ పబ్లిక్‌ ఇష్యూ ఆగస్టు 4న ప్రారంభమై 6వ తేదీతో ముగియనుంది. ఐపీఓలో భాగంగా రూ.165 కోట్ల తాజా షేర్లను, ఆఫర్‌ ఫర్‌ సేల్‌ పద్ధతిలో 51,42,067 షేర్లను విక్రయించనున్నారు. ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో విమ్లా విండ్లాస్‌ 11.36 లక్షల షేర్లను, పెట్టుబడిదారు టానో ఇండియా ప్రైవేట్‌ ఈక్విటీ ఫండ్‌ 2 40,06,067 షేర్లను విక్రయిస్తాయి. ఇష్యూ ధరలో గరిష్ఠమైన రూ.460ను లెక్కలోకి తీసుకుంటే ఈ ఐపీఓ ద్వారా సంస్థకు రూ.401.53 కోట్లు రావొచ్చు. ఐపీఓ ద్వారా వచ్చిన నిధులను డెహ్రాడూన్‌ ప్లాంట్‌ సామర్థ్య విస్తరణ, మూలధన వ్యయాలు, రుణాల చెల్లింపు, కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనున్నారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని