ఈ నెలలోనే పేటీఎం రూ.16,600 కోట్ల ఐపీఓ!
close

Published : 23/10/2021 05:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈ నెలలోనే పేటీఎం రూ.16,600 కోట్ల ఐపీఓ!

దిల్లీ: డిజిటల్‌ ఆర్థిక సేవల సంస్థ పీటీఎం రూ.16,600 కోట్ల మెగా పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ)కు మార్కెట్‌ నియంత్రణాధికార సంస్థ సెబీ ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియలో పాలుపంచుకుంటున్న ఒక వ్యక్తి ఈ సమాచారం అందించారని పీటీఐ తెలిపింది. ఈ నెలాఖరులోగా ఇష్యూ మార్కెట్లోకి రావొచ్చని కంపెనీ అంచనా వేస్తోంది. అందుకు తగ్గట్లుగా నమోదు(లిస్టింగ్‌)ను వేగవంతం చేసేందుకు ప్రీ-ఐపీఓ షేర్ల విక్రయాన్ని రద్దు చేసుకోవాలని భావిస్తోంది. ఆ మేరకు కంపెనీ విలువకు సంబంధం లేని ప్రీ-ఐపీఓ నిధుల సమీకరణ ప్రణాళికలను సంస్థ పక్కనపెడుతోందని ఆ వ్యక్తి పేర్కొన్నారు. కంపెనీ విలువ రూ.1.47-1.78 లక్షల కోట్లుగా ఉండాలని పేటీఎం భావిస్తోంది.

28 నుంచి నైకా పబ్లిక్‌ ఇష్యూ: నైకా బ్రాండ్‌ పేరుతో సౌందర్య ఉత్పత్తులు విక్రయించే ఎఫ్‌ఎస్‌ఎన్‌ ఇ-కామర్స్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) అక్టోబరు 28న మొదలై నవంబరు 1న ముగియనుంది. ఇందుకు ధరల శ్రేణిగా రూ.1085-1125ను కంపెనీ నిర్ణయించింది. పబ్లిక్‌ ఇష్యూ ద్వారా కంపెనీ రూ.5,352 కోట్లు సమీకరించాలని చూస్తోంది. ముసాయిదా పత్రాల ప్రకారం.. తాజాగా రూ.630 కోట్ల ఈక్విటీ షేర్లను, ఆఫర్‌ ఫర్‌ సేల్‌ పద్ధతిలో 41,972,660 ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు, తాజా వాటాదార్లు విక్రయించనున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని