వాణిజ్య బొగ్గు గనుల వేలం ప్రారంభం - govt offers 67 blocks in second tranche of commercial coal mine auction
close

Published : 25/03/2021 22:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వాణిజ్య బొగ్గు గనుల వేలం ప్రారంభం

దిల్లీ: దేశంలో వాణిజ్య బొగ్గు గనుల రెండో విడత వేలం ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. ఆరు రాష్ట్రాల పరిధిలోని 67 బొగ్గు బ్లాకులను కేంద్రం వేలానికి ఉంచింది. ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’వైపు వేస్తున్న ముందడుగుగా దీన్ని అభివర్ణించింది. వేలం ప్రక్రియను కేంద్ర బొగ్గు గనుల శాఖమంత్రి ప్రహ్లాద్‌ జోషి గురువారం దిల్లీలో ప్రారంభించగా.. నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌, బొగ్గు శాఖ కార్యదర్శి అనిల్‌ కుమార్‌ జైన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అపారమైన బొగ్గు నిల్వలను వినియోగించుకునేందుకు పెట్టుబడిదారులు ముందుకు రావాలని, వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడమేకాక దేశాభివృద్ధికి పాటుపడాలని జోషి కోరారు. వాణిజ్య బొగ్గు మైనింగ్‌ ద్వారా కొత్త పెట్టుబడులు వస్తాయని, ఉపాధి అవకాశాలు కూడా వస్తాయని చెప్పారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ కల సాకారం అవుతుందని చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌, ఒడిశా, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ పరిధిలో ఈ బొగ్గు బ్లాకులు ఉన్నాయి. 2014 ఈ వేలం ప్రక్రియ ప్రారంభం కాగా.. ఈ స్థాయిలో గనులను వేలానికి ఉంచడం ఇదే తొలిసారి.

ఇవీ చదవండి..

మార్కెట్లకు భారీ నష్టాలు

వరుసగా రెండో రోజు.. తగ్గిన ఇంధన ధరలు!


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని